డకౌటైనందుకు యువీ సంతోషించాడు: అభిషేక్‌

టీ20 క్రికెట్లో అరంగేట్ర మ్యాచ్‌లో డకౌటైనందుకు తన మెంటార్‌ యువరాజ్‌ సింగ్‌ సంతోషించాడని భారత ఓపెనర్‌ అభిషేక్‌శర్మ తెలిపాడు. జింబాబ్వేతో మొదటి మ్యాచ్‌లో డకౌటైన అభిషేక్‌.. రెండో పోరులో సెంచరీతో అదరగొట్టాడు.

Published : 09 Jul 2024 02:30 IST

హరారె: టీ20 క్రికెట్లో అరంగేట్ర మ్యాచ్‌లో డకౌటైనందుకు తన మెంటార్‌ యువరాజ్‌ సింగ్‌ సంతోషించాడని భారత ఓపెనర్‌ అభిషేక్‌శర్మ తెలిపాడు. జింబాబ్వేతో మొదటి మ్యాచ్‌లో డకౌటైన అభిషేక్‌.. రెండో పోరులో సెంచరీతో అదరగొట్టాడు. ‘‘శనివారం కూడా యువీతో మాట్లాడా. నేను సున్నా మీద ఔటైనందుకు అతను ఎందుకు సంతోషంగా ఉన్నాడో అర్థంకాలేదు. అది శుభారంభం అని యువీ చెప్పాడు. అయితే సెంచరీ సాధించడం పట్ల నా కుటుంబం మాదిరే యువీ కూడా గర్విస్తాడు. నా ప్రదర్శనకు కారణం అతనే. నన్ను ఇలా తయారు చేయడానికి అతనెంతో కష్టపడ్డాడు. మైదానం లోపల, బయట రెండు.. మూడేళ్లు నా కోసం శ్రమించాడు. ఆదివారం ఫోన్‌ చేసినప్పుడు ‘బాగా ఆడావు.. గర్వంగా ఉంది. ఇంకా చాలా ఘనతలు సాధిస్తావు. ఇది ఆరంభం మాత్రమే’ అని యువీ నాతో అన్నాడు’’ అని అభిషేక్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని