ఎవరిదో సిరీస్‌.. భారత్, దక్షిణాఫ్రికా ఆఖరి టీ20 నేడు

భారత పర్యటనలో దక్షిణాఫ్రికా మహిళల జట్టు ఆఖరి పోరాటానికి సిద్ధమైంది. మంగళవారం జరిగే మూడో టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య భారత్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి మ్యాచ్‌లో విజయంతో జోరుమీదున్న దక్షిణాఫ్రికా.. చివరి పోరులో గెలుపుతో సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తుంది.

Published : 09 Jul 2024 02:33 IST

రాత్రి 7 నుంచి

చెన్నై: భారత పర్యటనలో దక్షిణాఫ్రికా మహిళల జట్టు ఆఖరి పోరాటానికి సిద్ధమైంది. మంగళవారం జరిగే మూడో టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య భారత్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి మ్యాచ్‌లో విజయంతో జోరుమీదున్న దక్షిణాఫ్రికా.. చివరి పోరులో గెలుపుతో సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తుంది. మూడో మ్యాచ్‌లో విజయంతో సిరీస్‌ను సమం చేయాలని భారత్‌ పట్టుదలతో ఉంది. వర్షం కారణంగా రెండో మ్యాచ్‌ రద్దయింది. ఈ పర్యటనలో మూడు వన్డేల సిరీస్, ఏకైక టెస్టులో సఫారీ జట్టును భారత్‌ చిత్తుచేసింది. టీ20 సిరీస్‌నూ కైవసం చేసుకోవాలని భావించిన భారత్‌కు దక్షిణాఫ్రికా నుంచి ప్రతిఘటన ఎదురైంది. తొలి మ్యాచ్‌లో గొప్పగా ఆడిన సఫారీ జట్టు 12 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ లారా వోల్వార్డ్, తజ్మిన్‌ బ్రిట్స్, మరిజేన్‌ కాప్‌ సత్తాచాటి దక్షిణాఫ్రికాకు విజయాన్ని అందించారు. భారత జట్టులో వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్, జెమీమా రోడ్రిగ్స్‌ రాణించినా సానుకూల ఫలితం రాలేదు. ఆఖరి మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో సత్తాచాటి సిరీస్‌ను సమం చేయాలని భారత్‌ భావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని