టీమ్‌ఇండియా నుంచి అది నేర్చుకోవాలి

ఎలాంటి స్థితిలోనూ ఆశలు వదులుకోవద్దని భారత క్రికెట్‌ జట్టును చూసి నేర్చుకున్నానని హాకీ గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ అన్నాడు. సంబరాలకు తొందరపడకూడదని కూడా అర్థమైందని చెప్పాడు.

Published : 09 Jul 2024 02:36 IST

బెంగళూరు: ఎలాంటి స్థితిలోనూ ఆశలు వదులుకోవద్దని భారత క్రికెట్‌ జట్టును చూసి నేర్చుకున్నానని హాకీ గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ అన్నాడు. సంబరాలకు తొందరపడకూడదని కూడా అర్థమైందని చెప్పాడు. దక్షిణాఫ్రికాతో టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా ఓటమి తప్పదనుకున్న స్థితి నుంచి పుంజుకుని, విజేతగా నిలిచిన నేపథ్యంలో శ్రీజేశ్‌ ఇలా స్పందించాడు. ‘‘టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ చూశా. చివరి బంతి వరకు సంబరాలు చేసుకోవద్దని నేర్చుకున్నా. 15వ ఓవర్‌కు దక్షిణాఫ్రికాదే మ్యాచ్‌. కానీ భారత జట్టు ఆశలు వదులుకోలేదు. ఓటమి కోరల్లో నుంచి విజయాన్ని లాగేసుకుంది. మేమే కాదు.. ఒలింపిక్స్‌కు వెళ్లే ప్రతి అథ్లెట్‌ కూడా భారత జట్టు నుంచి నేర్చుకోవాలి. ఎప్పుడూ ఆశలు వదులుకోవద్దు. ఆఖరి క్షణం వరకు పోరాడితే సాధించవచ్చు. ఈ విషయాన్ని నేను ఒలింపిక్స్‌లో గుర్తుపెట్టుకుంటా’’ అని శ్రీజేశ్‌ అన్నాడు. ‘‘గతంలో రాహుల్‌ ద్రవిడ్‌ను కలిశా. సహనంగా ఉండడం, మన సమయం కోసం నిరీక్షించడం ఎంత ముఖ్యమో చెప్పాడు. నేను అదే చేశా. నేను ఒక్క రాత్రితో ప్రపంచంలో మేటి గోల్‌కీపర్లలో ఒకడిని కాలేదు. నా అవకాశాల కోసం ఎదురుచూశా. ద్రవిడ్‌ను చూసి అణకువగా ఉండడం కూడా నేర్చుకున్నా’’ అని చెప్పాడు. పారిస్‌ క్రీడలు శ్రీజేశ్‌ కెరీర్‌లో నాలుగో ఒలింపిక్స్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని