భారత జట్టులో జైస్వాల్, సంజు, దూబె

జింబాబ్వేతో చివరి మూడు టీ20ల కోసం శుభ్‌మన్‌ గిల్‌ నేతృత్వంలోని భారత జట్టులో మూడు మార్పులు చేశారు. టీ20 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులోని సభ్యులైన యశస్వి జైస్వాల్, వికెట్‌కీపర్‌ సంజు శాంసన్, ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబె తిరిగి జట్టులోకి వచ్చారు.

Published : 09 Jul 2024 02:38 IST

హరారె: జింబాబ్వేతో చివరి మూడు టీ20ల కోసం శుభ్‌మన్‌ గిల్‌ నేతృత్వంలోని భారత జట్టులో మూడు మార్పులు చేశారు. టీ20 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులోని సభ్యులైన యశస్వి జైస్వాల్, వికెట్‌కీపర్‌ సంజు శాంసన్, ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబె తిరిగి జట్టులోకి వచ్చారు. సాయి సుదర్శన్, హర్షిత్‌ రాణా, పంజాబ్‌ వికెట్‌కీపర్‌ జితేశ్‌ శర్మ చోటు కోల్పోయారు. రెండో టీ20తో అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్‌కు ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. మూడో టీ20 బుధవారం జరుగుతుంది.

చివరి మూడు టీ20లకు భారత జట్టు: జైస్వాల్, గిల్, అభిషేక్‌ శర్మ, రుతురాజ్, సంజు శాంసన్, శివమ్‌ దూబె, రింకు సింగ్, సుందర్, రవి బిష్ణోయ్, అవేష్‌ ఖాన్, ముకేశ్‌ కుమార్, ఖలీల్‌ అహ్మద్, ధ్రువ్‌ జురెల్, తుషార్‌ దేశ్‌పాండే, రియాన్‌ పరాగ్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని