వార్నర్‌లో మళ్లీ వన్డే ఆశలు

తన అంతర్జాతీయ క్రికెట్‌ అధ్యాయం ముగిసిందని.. కానీ పూర్తిగా కాదని ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు. వచ్చే ఏడాది ఛాంపియన్స్‌ ట్రోఫీకి ఎంపిక చేస్తే ఆడేందుకు సిద్ధమని తెలిపాడు.

Published : 10 Jul 2024 02:35 IST

సిడ్నీ: తన అంతర్జాతీయ క్రికెట్‌ అధ్యాయం ముగిసిందని.. కానీ పూర్తిగా కాదని ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు. వచ్చే ఏడాది ఛాంపియన్స్‌ ట్రోఫీకి ఎంపిక చేస్తే ఆడేందుకు సిద్ధమని తెలిపాడు. ‘‘అధ్యాయం ముగిసింది. సుదీర్ఘ కాలం పాటు అత్యున్నత స్థాయిలో ఆడటం నమ్మశక్యం కాని అనుభూతి. ఆస్ట్రేలియా నా జట్టు. కెరీర్‌లో ఎక్కువ శాతం అంతర్జాతీయ స్థాయిలో ఆడటం నాకెంతో గర్వకారణం. మూడు ఫార్మాట్లలో వందకు పైగా మ్యాచ్‌ల చొప్పున ఆడటం నా కెరీర్‌లో గొప్ప విషయం. కొంతకాలం పాటు ఫ్రాంచైజీ క్రికెట్‌ ఆడతా. ఒకవేళ ఎంపిక చేస్తే ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధంగా ఉన్నా’’ అని వార్నర్‌ పేర్కొన్నాడు.


రెండో రౌండ్లో నగాల్‌ 

బ్రౌన్చ్‌వేగ్‌ (జర్మనీ): ఏటీపీ ఛాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నీలో భారత ఆటగాడు సుమిత్‌ నగాల్‌ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో నగాల్‌ 6-1, 6-4తో ఫెలిప్‌ మెలిజెని అల్వెస్‌ (బ్రెజిల్‌)పై విజయం సాధించాడు. బుధవారం రెండో రౌండ్లో పెడ్రో కాచిన్‌ (అర్జెంటీనా)తో నగాల్‌ తలపడతాడు. పారిస్‌ ఒలింపిక్స్‌కు సన్నాహం కోసం నగాల్‌ ఈ టోర్నీలో ఆడుతున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని