ఇంగ్లాండ్‌తో నెదర్లాండ్స్‌ ఢీ

యూరో 2024లో ఆసక్తికర పోరుకు వేళైంది. ఇంగ్లాండ్‌ బుధవారం జరిగే సెమీఫైనల్లో నెదర్లాండ్స్‌ను ఢీకొంటుంది.

Published : 10 Jul 2024 02:37 IST

యూరో రెండో సెమీఫైనల్‌ నేడు 
రాత్రి 12.30 నుంచి

డార్ట్‌మండ్‌: యూరో 2024లో ఆసక్తికర పోరుకు వేళైంది. ఇంగ్లాండ్‌ బుధవారం జరిగే సెమీఫైనల్లో నెదర్లాండ్స్‌ను ఢీకొంటుంది. రెండు జట్లు కూడా క్వార్టర్‌ఫైనల్స్‌లో మొదట గోల్‌ ఇచ్చినా, పుంజుకుని విజయం సాధించాయి. ఇంగ్లాండ్‌ పెనాల్టీ షూటౌట్లో 5-3తో స్విట్జర్లాండ్‌పై నెగ్గగా.. నెదర్లాండ్స్‌ 2-1తో తుర్కియేను ఓడించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్‌ అయిదో స్థానంలో ఉండగా.. డచ్‌ జట్టు ఏడో స్థానంలో ఉంది. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన అయిదు మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్‌ ఒక్క దాంట్లో (రొమేనియాపై) మాత్రమే మొదట గోల్‌ సాధించింది. ఇంగ్లాండ్‌ చివరగా గ్రూప్‌ దశ మ్యాచ్‌లో మొదట గోల్‌ (డెన్మార్క్‌పై) చేసింది. కిందటిసారి ఫైనల్లో ఓడిన ఇంగ్లాండ్‌.. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు నెదర్లాండ్స్‌ 1988లో కప్పు గెలిచాక మళ్లీ యూరో ఫైనల్‌కు రాలేదు. సెమీఫైనల్‌కు కూడా చివరగా 2004లో చేరింది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 22 మ్యాచ్‌ల్లో తలపడగా.. నెదర్లాండ్స్‌ ఏడు సార్లు, ఇంగ్లాండ్‌ ఆరుసార్లు నెగ్గాయి.   9 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఇంగ్లాండ్‌కు బుకాయో, హ్యారీ కేన్, బెలింగ్‌హామ్‌.. నెదర్లాండ్స్‌కు డిపే, వెగార్‌స్ట్, మలెన్‌ కీలక ఆటగాళ్లు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని