ఖరారు కాని గంభీర్‌ వేతనం

టీమ్‌ఇండియా చీఫ్‌ కోచ్‌గా నియమితుడైన గౌతమ్‌ గంభీర్‌ వేతనం ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతం సహాయక సిబ్బంది ఎంపికపై దృష్టిసారించిన గంభీర్‌కు వేతనంపై పెద్దగా పట్టింపులు లేవని బీసీసీఐ వర్గాలంటున్నాయి.

Published : 11 Jul 2024 03:29 IST

దిల్లీ: టీమ్‌ఇండియా చీఫ్‌ కోచ్‌గా నియమితుడైన గౌతమ్‌ గంభీర్‌ వేతనం ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతం సహాయక సిబ్బంది ఎంపికపై దృష్టిసారించిన గంభీర్‌కు వేతనంపై పెద్దగా పట్టింపులు లేవని బీసీసీఐ వర్గాలంటున్నాయి. ‘‘బాధ్యతల స్వీకరణకే గంభీర్‌ మొదటి ప్రాధాన్యత. జీతం, ఇతర విషయాలు తర్వాత కూడా మాట్లాడుకోవచ్చని అతనికి తెలుసు. 2014లో చీఫ్‌ కోచ్‌ డంకన్‌ ఫ్లెచర్‌ స్థానంలో క్రికెట్‌ డైరెక్టర్‌గా రవిశాస్త్రిని నియమించినప్పుడూ ఇలాగే జరిగింది. రవిశాస్త్రి బాధ్యతలు స్వీకరించిన రోజు అతనితో బీసీసీఐ ఒప్పందం కూడా పూర్తి కాలేదు. అయినా అతను పనులు చక్కబెట్టుకున్నాడు. గంభీర్‌ విషయంలోనూ అలాగే ఉంటుంది. దాదాపుగా రాహుల్‌ ద్రవిడ్‌కు ఇచ్చిన వేతనమే గంభీర్‌కూ ఇచ్చే అవకాశముంది’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మరోవైపు గంభీర్‌ శిక్షణ బృందం ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ముంబయి మాజీ ఆటగాడు అభిషేక్‌ నాయర్‌ను సహాయక కోచ్‌గా నియమించడం ఖాయంగా కనిపిస్తోంది. బౌలింగ్‌ కోచ్‌గా లక్ష్మీపతి బాలాజీ, జహీర్‌ఖాన్‌ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని