రూ.2.5 కోట్లు వద్దనుకున్న ద్రవిడ్‌!

టీమ్‌ఇండియా మాజీ కోచ్, భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరోసారి ఉత్తమ వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు.

Published : 11 Jul 2024 03:30 IST

దిల్లీ: టీమ్‌ఇండియా మాజీ కోచ్, భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరోసారి ఉత్తమ వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన ద్రవిడ్‌.. బోనస్‌ రూ.2.5 కోట్లను వదులుకున్నారని తెలిసింది. పొట్టికప్‌ను గెలిచిన భారత జట్టుకు, కోచింగ్‌ సిబ్బందికి బీసీసీఐ నజరానా ప్రకటించిన విషయం విదితమే. దీని ప్రకారం కోచింగ్‌ సిబ్బందికి తలా ఒక్కరికి రూ.2.5 కోట్ల చొప్పున వచ్చాయి. కానీ ప్రధాన కోచ్‌ కాబట్టి ద్రవిడ్‌కు ఆటగాళ్లతో సమానంగా రూ.5 కోట్లు ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించిందని సమాచారం. కానీ అదనపు బోనస్‌ను సున్నితంగా తిరస్కరించిన ద్రవిడ్‌.. ఇతర కోచింగ్‌ సిబ్బందితో సమానంగానే రూ.2.5 కోట్లు తీసుకున్నాడని తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని