పారాలింపిక్స్‌కు రుబీనా, స్వరూప్‌

భారత పారా షూటర్లు రుబీనా ఫ్రాన్సిస్, స్వరూప్‌ ఉనాల్కర్‌ పారిస్‌ పారాలింపిక్స్‌ బెర్తులు పట్టేశారు. వైల్డ్‌కార్డు ప్రవేశం ద్వారా వీరికి అవకాశం దక్కింది.

Published : 11 Jul 2024 03:34 IST

దిల్లీ: భారత పారా షూటర్లు రుబీనా ఫ్రాన్సిస్, స్వరూప్‌ ఉనాల్కర్‌ పారిస్‌ పారాలింపిక్స్‌ బెర్తులు పట్టేశారు. వైల్డ్‌కార్డు ప్రవేశం ద్వారా వీరికి అవకాశం దక్కింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఎస్‌హెచ్‌1 విభాగంలో పోటీ పడే రుబీనా ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఎస్‌హెచ్‌1లో స్వరూప్‌ తలపడుతున్నాడు. నిలకడగా రాణిస్తున్న ఈ షూటర్లు తృటిలో పారిస్‌ ఒలింపిక్స్‌ అర్హత అవకాశాన్ని కోల్పోయారు. దీంతో వీరికి వైల్డ్‌కార్డు ప్రవేశం కల్పించాలని భారత పారాలింపిక్‌ కమిటీ చేసిన విన్నపాన్ని ఐఓసీ మన్నించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని