Copa America semifinal: మెస్సి గోల్‌.. ఫైనల్లో ఛాంపియన్‌

కోపా అమెరికా ఫుట్‌బాల్‌ టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనా ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం సెమీస్‌లో ఆ జట్టు 2-0 తేడాతో కెనడాను ఓడించింది.

Published : 11 Jul 2024 03:40 IST

సెమీస్‌లో అర్జెంటీనా విజయం 
ఈస్ట్‌ రూథర్‌ఫర్డ్‌

కోపా అమెరికా ఫుట్‌బాల్‌ టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనా ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం సెమీస్‌లో ఆ జట్టు 2-0 తేడాతో కెనడాను ఓడించింది. దిగ్గజ ఆటగాడు మెస్సి (51వ నిమిషంలో) 109వ అంతర్జాతీయ గోల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అత్యధిక అంతర్జాతీయ గోల్స్‌ రికార్డులో కేవలం క్రిస్టియానో రొనాల్డో (130) మాత్రమే అతని కంటే ముందున్నాడు. కెనడాతో మ్యాచ్‌లో అర్జెంటీనా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. బంతిపై నియంత్రణ కొనసాగించింది. ప్రత్యర్థి గోల్‌ పోస్టుపై పదేపదే దాడులు చేసింది. 22వ నిమిషంలో జులియన్‌ అల్వారెజ్‌ గోల్‌తో ఆ జట్టు ఖాతా తెరిచింది. పెనాల్టీ ప్రదేశం నుంచి అతను మెరుపు కిక్‌తో గోల్‌ సాధించాడు. ఆ బంతి గోల్‌కీపర్‌ కాళ్ల మధ్యలో నుంచి నెట్‌లోకి వెళ్లిపోయింది. అక్కడి నుంచి అర్జెంటీనా మరింత దూకుడుగా ఆడింది. ముఖ్యంగా డ్రిబ్లింగ్‌ నైపుణ్యాలతో మెస్సి అలరించాడు. రెండో అర్ధభాగంలో గోల్‌ పోస్టుకు సమీపంలో నుంచే బంతిని లోపలికి పంపిన మెస్సి జట్టును విజయపథంలో నడిపించాడు. అర్జెంటీనా తరపున గత 25 మ్యాచ్‌ల్లో మెస్సి 28 గోల్స్‌ చేశాడు. కోపా అమెరికాలో అతనికిది 14వ గోల్‌. అర్జెంటీనాకు  ఇది వరుసగా పదో విజయం. 

అర్జెంటీనాతో ఆడేదెవరో? 
కోపా అమెరికా సెమీస్‌లో 
నేడు ఉరుగ్వే × కొలంబియా
ఉదయం 5.30 నుంచి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని