Published : 10 Feb 2021 01:47 IST

రెండో రౌండ్లో నాదల్‌

బార్టీ ముందంజ

మెల్‌బోర్న్‌: 21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పై గురిపెట్టిన స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌  ఆస్ట్రేలియన్‌ ఓపెన్లో విజయవంతంగా తొలి అడుగు వేశాడు. మంగళవారం పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో రెండో సీడ్‌ నాదల్‌ 6-3, 6-4, 6-1తో అన్‌సీడెడ్‌ లాస్లో (చెక్‌ రిపబ్లిక్‌)పై విజయం సాధించాడు. ఇతర మ్యాచ్‌ల్లో మెద్వెదెవ్‌ (రష్యా) 6-2, 6-2, 6-4తో పోస్‌పిసిల్‌ (కెనడా)పై గెలవగా, రుబ్‌లెవ్‌ (రష్యా) 6-3, 6-3, 6-4తో హాఫ్‌మాన్‌ (జర్మనీ)పై, బస్టా (స్పెయిన్‌) 7-5, 7-6 (7-4), 6-2తో నిషికోరి (జపాన్‌)పై, సిట్సిపాస్‌ 6-1, 6-2, 6-1తో సిమోన్‌ (ఫ్రాన్స్‌)పై నెగ్గారు. 17 ఏళ్ల స్పెయిన్‌ కెరటం కార్లోస్‌ అల్కారస్‌ ముందంజ వేశాడు. అతను 6-1, 6-4, 6-4తో బొటిచ్‌ వాన్‌ (నెదర్లాండ్స్‌)ను ఓడించాడు. కొకిన్‌కిస్‌ (2014) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌ మ్యాచ్‌ గెలిచిన పిన్న వయస్కుడిగా అల్కారస్‌ ఘనత సాధించాడు.
నగాల్‌ ఔట్‌: వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీగా బరిలో దిగిన భారత యువ ఆటగాడు సుమిత్‌ నగాల్‌ పోరు తొలి రౌండ్లోనే ముగిసింది. నగాల్‌ 2-6, 5-7, 3-6తో రికార్డాస్‌ బెరాంకీస్‌ (లిథుయేనియా) చేతిలో ఓడాడు.
బార్టీ అలవోకగా..: మహిళల సింగిల్స్‌లో టాప్‌సీడ్‌ ఆష్లె బార్టీ (ఆస్ట్రేలియా) శుభారంభం చేసింది. ఏడాది పైగా విరామం తర్వాత తొలి గ్రాండ్‌స్లామ్‌ మ్యాచ్‌ ఆడుతున్న బార్టీ 6-0,  6-0తో డాంకా కొవినిచ్‌ (మాంటెనిగ్రో)ను చిత్తుగా ఓడించింది. నాలుగోసీడ్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా), ఆరో సీడ్‌ ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌), అయిదోసీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌), పదకొండో సీడ్‌ బెన్సిచ్‌ (స్విట్జర్లాండ్‌) ముందంజ వేశారు.అమెరికా యువ కెరటం కోకో గాఫ్‌ రెండో రౌండ్‌ చేరగా.. మరో యువ తార స్లోన్‌ స్టీఫెన్స్‌ ఓడిపోయింది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని