అంపైర్స్ కాల్ కొనసాగుతుంది
నిర్ణయ సమీక్షా విధానంలో ‘అంపైర్స్ కాల్’ భాగంగానే ఉంటుందని ఐసీసీ స్పష్టం చేసింది. ‘అంపైర్స్ కాల్’ విషయంలో గందరగోళం ఉందని భారత కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు పలువురు
దుబాయ్: నిర్ణయ సమీక్షా విధానంలో ‘అంపైర్స్ కాల్’ భాగంగానే ఉంటుందని ఐసీసీ స్పష్టం చేసింది. ‘అంపైర్స్ కాల్’ విషయంలో గందరగోళం ఉందని భారత కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు పలువురు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. ఐసీసీ క్రికెట్ కమిటీ ఈ వివాదాస్పద నిబంధనపై చర్చించింది. ప్రస్తుత నిబంధన ప్రకారం అంపైర్ నాటౌట్‌గా ప్రకటించిన ఎల్బీడబ్ల్యూ నిర్ణయాన్ని సవరించి ఔట్‌గా ప్రకటించాలంటే.. ఏదైనా స్టంప్‌ను బంతి 50 కంటే ఎక్కువ శాతం తాకాలి. బంతిలో కొద్ది భాగం స్టంప్స్‌కు తాకినా ఔట్‌గా ప్రకటించాలనేది కోహ్లి వాదన. అయితే అందుకు ఐసీసీ సుముఖత వ్యక్తం చేయలేదు. కానీ.. నిర్ణయ సమీక్ష విధానం (డీఆర్‌ఎస్), మూడో అంపైర్ నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసింది. కొవిడ్ నేపథ్యంలో ఐసీసీ సీనియర్ టోర్నీల్లో తలపడే జట్లు ఏడుగురు సభ్యులను అదనంగా పెంచుకునే అవకాశం కల్పించింది.
ఐసీసీ నిర్ణయాలు: * సమీక్ష ద్వారా ఎల్బీడబ్ల్యూ నిర్ణయాలు పరిశీలించేటప్పుడు వికెట్ ప్రాంతం ఎత్తును పెంచారు. ఇప్పటిదాకా బెయిల్స్ కింద వరకు మాత్రమే పరిగణనలోకి తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు బెయిల్స్ పైభాగం వరకు ఎత్తును లెక్కలోకి తీసుకోనున్నారు.
* బ్యాట్స్‌మన్ పరుగును పూర్తి చేశాడా లేదా అన్నది మూడో అంపైర్ పరిశీలిస్తాడు. షార్ట్ రన్ చేసివుంటే తర్వాతి బంతి వేసేలోపు ప్రకటిస్తాడు.
* మహిళల వన్డే క్రికెట్ల్లో బ్యాటింగ్ పవర్ ప్లేను తొలగించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Kiran Kumar Reddy: ప్రాంతీయ పార్టీల వల్ల రాష్ట్రానికి నష్టమే: కిరణ్‌కుమార్‌రెడ్డి
-
Movies News
Allu Arjun: వరుణ్-లావణ్య నిశ్చితార్థం.. మా నాన్న ఆనాడే చెప్పారు: అల్లు అర్జున్
-
Sports News
WTC Final: పిచ్ పరిస్థితి అలా ఉంది.. అదే జరిగితే 450 కూడా కొట్టొచ్చు: శార్దూల్
-
General News
Avinash Reddy: ఏడు గంటలపాటు సాగిన అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ
-
India News
Smriti Irani: జర్నలిస్టును ‘బెదిరించిన’ స్మృతి ఇరానీ.. వీడియో షేర్ చేసిన కాంగ్రెస్
-
Sports News
WTC Final: వారి ఆటతీరు.. టాప్‌ఆర్డర్‌కు గుణపాఠం: సౌరభ్ గంగూలీ