
చిన్నోడు చితక్కొట్టేశాడు
షా విధ్వంసం
కోల్‌కతాపై దిల్లీ ఘన విజయం
అలా ఇలా కొట్టలేదు పృథ్వీ షా! కళ్లు చెదిరే బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడతను! ఈ కుర్రాడు ఆకాశమే హద్దుగా చెలరేగిన వేళ కోల్‌కతా నైట్‌రైడర్స్ తేలిపోయింది.. ఆ జట్టు బౌలర్లను ఆటాడేసుకున్న షా.. దిల్లీని అలవోకగా గెలిపించాడు. అంతేకాదు గత మ్యాచ్‌లో ఓడిన తమ జట్టును మళ్లీ గాడిలో పెట్టాడు. మరోవైపు వరుసగా నాలుగు పరాజయాల తర్వాత గత మ్యాచ్ నెగ్గి ఊపిరి పీల్చుకున్న కోల్‌కతా మరోసారి ఓటమి బాట పట్టింది.
అహ్మదాబాద్
దిల్లీ క్యాపిటల్స్‌కు అదిరే విజయం! ఓపెనర్ పృథ్వీ షా (82; 41 బంతుల్లో 11×4, 1×6) విధ్వంసం సృష్టించిన వేళ ఆ జట్టు 7 వికెట్ల తేడాతో కోల్‌కతాను ఓడించింది. గురువారం మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. ఆంద్రీ రసెల్ (45 నాటౌట్; 27 బంతుల్లో 2×4, 4×6) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఛేదనలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పృథ్వీ మెరుపులతో దిల్లీ 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఆరంభ ఓవర్లోనే వరుస ఫోర్లతో గడగడలాడించిన పృథ్వీ ఏ దశలోనూ కోల్‌కతాకు పుంజుకునే అవకాశమే ఇవ్వలేదు.
బాదుడే.. బాదుడే: పోరాడే స్కోరు చేశామన్న ఆనందాన్ని కొద్దిసేపైనా కోల్‌కతాకు మిగిల్చకుండా ఆరంభం నుంచి విరుచుకుపడ్డాడు పృథ్వీ. తొలి ఓవర్లోనే పరుగుల వరద పారింది. అక్కడ నుంచి దిల్లీ ఎక్కడా ఆగలేదు. ఒకవైపు పృథ్వీ పిడుగుల్లాంటి షాట్లతో పరుగుల వర్షం కురిపిస్తుంటే.. మరోవైపు ధావన్ (46; 47 బంతుల్లో 4×4, 1×6) అతడికి సహకారం అందించాడు. పవర్ ప్లే ఆఖరికి దిల్లీ 67/0తో నిలువగా అందులో పృథ్వీ షా వాటానే 48 పరుగులంటే అతడి విధ్వంసాన్ని ఊహించొచ్చు. 18 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న ఈ ఓపెనర్.. ఆ తర్వాతా జోరు కొనసాగించాడు. దీంతో 10.3 ఓవర్లకే దిల్లీ స్కోరు 100 పరుగులు దాటి లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. ఓపెనర్లిద్దరే మ్యాచ్‌ను పూర్తి చేస్తారేమో అనుకున్న సమయంలో ధావన్‌ను ఔట్ చేసిన కమిన్స్ 132 పరుగుల తొలి వికెట్ భాగస్వామానికి తెరదించాడు. పృథ్వీతో పాటు పంత్ (16; 8 బంతుల్లో 2×4, 1×6)ను కమిన్స్ (3/24) ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చినా.. లక్ష్యం చేరువగా ఉండడంతో దిల్లీ ఆందోళన పడలేదు. హెట్మయర్ (0 నాటౌట్)తో కలిసి స్టాయినిస్ (6 నాటౌట్) పని పూర్తి చేశాడు. మరో 21 బంతులు మిగిలుండగానే దిల్లీ లక్ష్యాన్ని అందుకుంది.
రసెల్ ఆఖర్లో: అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఆరంభంలో వేగంగా ఆడలేకపోయింది.. 3 ఓవర్లకు ఆ జట్టు చేసింది 18 పరుగులే. ఈ దశలో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ సిక్స్ కొట్టి స్కోరును కదిలించిన నితీష్ రాణా (15).. ఆ తర్వాత బంతికే స్టంపౌటయ్యాడు. ఈ స్థితిలో గిల్ వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తూ రన్‌రేట్ పడిపోకుండా చూశాడు. కానీ ఒకే ఓవర్లో మోర్గాన్ (0), నరైన్ (0) వికెట్లు తీసిన స్పిన్నర్ లలిత్ (2/13) కోల్‌కతాను గట్టి దెబ్బ కొట్టాడు. దీనికి తోడు రన్‌రేట్ మరీ తక్కువగా ఉండడంతో గిల్‌పై ఒత్తిడి పెరిగిపోయింది. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అతను కూడా ఔట్ కావడంతో కోల్‌కతా 13 ఓవర్లలో 82/5తో తీవ్ర ఇబ్బందుల్లో పడింది. రసెల్ క్రీజులో ఉన్నా కూడా ఆరంభంలో వేగంగా ఆడకపోవడంతో ఒక దశలో ఆ జట్టు పోరాడే స్కోరైనా చేస్తుందా అనిపించింది. 18 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 123/6 మాత్రమే. కానీ చివర్లో ఈ కరీబియన్ స్టార్ చెలరేగాడు. కమిన్స్ వేసిన 19వ ఓవర్లో రెండు భారీ సిక్స్‌లతో సహా 18 పరుగులు రాబట్టిన ఈ హిట్టర్.. జట్టు ఇన్నింగ్స్‌ను సిక్స్‌తో ముగించాడు. మొత్తం మీద చివరి రెండు ఓవర్లలో 31 పరుగులు రావడంతో కేకేఆర్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. దిల్లీ బౌలర్లలో లలిత్ పాటు అక్షర్ పటేల్ (2/32), స్టాయినిస్ (1/7) రాణించారు.
6 బంతులు.. 6 ఫోర్లు
దిల్లీ ఇన్నింగ్స్‌లో ఆరంభం నుంచి చెలరేగిన ఓపెనర్ పృథ్వీ షా ఒకే ఓవర్లో ఆరు ఫోర్లు బాదేశాడు. పేసర్ శివమ్ మావి వేసిన తొలి ఓవర్లో అతడీ విధ్వంసానికి తెర తీశాడు. తొలి బంతిని మావి వైడ్ వేయగా.. అదనంగా వచ్చిన బంతిని బౌండరీకి పంపిన షా.. ఆ తర్వాత మిగిలిన అయిదు బంతులను కూడా ఫోర్లుగా మలిచాడు. స్ట్రెయిట్ షాట్, లెగ్‌సైడ్ ఫ్లిక్, కవర్‌డ్రైవ్, స్క్వేర్ డ్రైవ్ లాంటి భిన్నమైన షాట్లతో అతడీ పరుగులు రాబట్టాడు. ఐపీఎల్ చరిత్రలో అజింక్య రహానె (రాజస్థాన్ రాయల్స్, 2012లో బెంగళూరుపై) తర్వాత ఒకే ఓవర్లో 6 ఫోర్లు కొట్టిన ఘనత పృథ్వీదే.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: నితీష్ (స్టంప్డ్) అక్షర్ 15; శుభ్‌మన్ (సి) స్మిత్ (బి) అవేశ్ 43; త్రిపాఠి (సి) లలిత్ (బి) స్టాయినిస్ 19; మోర్గాన్ (సి) స్మిత్ (బి) లలిత్ 0; నరైన్ (బి) లలిత్ 0; రసెల్ నాటౌట్ 45; కార్తీక్ ఎల్బీ (బి) అక్షర్ 14; కమిన్స్ నాటౌట్ 11; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 154; వికెట్ల పతనం: 1-25, 2-69, 3-74, 4-75, 5-82, 6-109; బౌలింగ్: ఇషాంత్ 4-0-34-0; రబాడ 4-0-31-0; అక్షర్ పటేల్ 4-0-32-2; అవేశ్ ఖాన్ 4-0-31-1; లలిత్ యాదవ్ 3-0-13-2; స్టాయినిస్ 1-0-7-1
దిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) రాణా (బి) కమిన్స్ 82; ధావన్ ఎల్బీ (బి) కమిన్స్ 46; పంత్ (సి) శివమ్ మావి (బి) కమిన్స్ 16; స్టాయినిస్ నాటౌట్ 6; హెట్మయర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (16.3 ఓవర్లలో 3 వికెట్లకు) 156; వికెట్ల పతనం: 1-132, 2-146, 3-150; బౌలింగ్: శివమ్ మావి 1-0-25-0; వరుణ్ చక్రవర్తి 4-0-34-0; ప్రసిద్ధ్‌కృష్ణ 3.3-0-36-0; నరైన్ 4-0-36-0; కమిన్స్ 4-0-24-3
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
-
Technology News
Android 12: ఆండ్రాయిడ్ 12 యూజర్లకు గూగుల్ మరో కొత్త యాప్
-
World News
Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
-
India News
Road Safety: ఆ నియమాలు పాటిస్తే.. ఏటా 30వేల ప్రాణాలు సేవ్ : ది లాన్సెట్
-
Sports News
Eoin Morgan: ధోనీ, మోర్గాన్ కెప్టెన్సీలో పెద్ద తేడా లేదు: మొయిన్ అలీ
-
Crime News
Cyber Crime: మీ ఖాతాలో డబ్బులు పోయాయా?.. వెంటనే ఇలా చేయండి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- రూ.వందల కోట్ల ఆర్థిక మాయ!
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో మీటింగ్.. అభిమాని భావోద్వేగం
- BJP: అంబర్‌పేట్‌లో భాజపా దళిత నాయకుడి ఇంట్లో భోజనం చేసిన యూపీ డిప్యూటీ సీఎం
- ‘ఉడత ఊపితే’ తీగలు తెగుతాయా!
- Eknath Shindhe: నాడు ఆటో నడిపారు.. ఇకపై మహారాష్ట్రను నడిపిస్తారు..
- Maharashtra: ‘నాన్నే చెప్పేవారు.. మనకు చెందనిది ఎప్పటికీ మనతో ఉండదని..’: ఆదిత్య ఠాక్రే