సీఎస్కే సభ్యుడు కాన్సన్‌ట్రేటర్‌ను పట్టుకుపోయాడు

తన తండ్రి వైద్యం కోసం ఓ వ్యక్తి కొనుకున్న ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ను పొరపాటున చెన్నై సూపర్‌ కింగ్స్‌ సభ్యుడు పట్టుకుపోయాడు. 36 గంటల తర్వాత అది తిరిగి సొంతదారుడికి చేరింది. ఈ సంఘటన

Published : 30 Apr 2021 02:21 IST

దిల్లీ: తన తండ్రి వైద్యం కోసం ఓ వ్యక్తి కొనుకున్న ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ను పొరపాటున చెన్నై సూపర్‌ కింగ్స్‌ సభ్యుడు పట్టుకుపోయాడు. 36 గంటల తర్వాత అది తిరిగి సొంతదారుడికి చేరింది. ఈ సంఘటన దిల్లీలో చోటుచేసుకుంది. ఇంతకీ ఏమైందంటే.. తన తండ్రిలో ప్రాణ వాయువు స్థాయి తక్కువగా ఉండటంతో అన్వర్‌ బెంగళూరులో కాన్సన్‌ట్రేటర్‌ను కొన్నాడు. ఈనెల 26న తనతో పాటు ఇండిగో విమానంలో దిల్లీకి తీసుకొచ్చాడు. అయితే బ్యాగేజీ బెల్టు దగ్గర కాన్సన్‌ట్రేటర్‌ ఉన్న కార్టన్‌ కనిపించకపోవడంతో అన్వర్‌ ఆందోళనకు గురయ్యాడు. వెంటనే విమానాశ్రయ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే అదే సమయంలో దిల్లీలో అడుగుపెట్టిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ సభ్యుడు అన్వర్‌ రావడానికి ముందే.. అతడి కాన్సన్‌ట్రేటర్‌ ఉన్న కార్టన్‌ను పట్టుకుపోయాడు. కరోనా తీవ్రత దృష్ట్యా ఆటగాళ్లు ఛార్టర్డ్‌ విమానాల్లో ప్రయాణిస్తున్నారు. వారు తమ వ్యక్తిగత వస్తువుల్ని మాత్రమే వెంట తీసుకెళ్లొచ్చు. మిగతా లగేజీని విడిగా రవాణా చేస్తున్నారు. వాటిని చేరేవేసే బాధ్యత ఫ్రాంఛైజీది. ఆటగాళ్ల లగేజీ హోటల్‌లో ఒకరోజంతా శానిటైజ్‌ చేస్తారు. ఆ తర్వాతే ఆటగాళ్లు తీసుకోవచ్చు. ఈనెల 27న రాత్రి సీఎస్కే.. తమ సభ్యుడు అదనపు కార్టన్‌ను తీసుకొచ్చినట్లు గుర్తించి    అధికారులకు సమాచారం అందించింది. ఆ కార్టన్‌ అన్వర్‌దేనని నిర్ధారించుకున్న అధికారులు అతనికి అప్పగించారు. సుమారు 36 గంటల తర్వాత అన్వర్‌కు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ లభించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని