చూశారా మా కండలు..

ఆరడుగులకు పైగా ఎత్తుతో భారీకాయుడైన క్రిస్‌ గేల్‌ ఓ వైపు! బక్కపలుచటి దేహంతో.. పొట్టిగా కనిపించే యుజ్వేంద్ర చాహల్‌ మరోవైపు!

Updated : 02 May 2021 01:56 IST

ఆరడుగులకు పైగా ఎత్తుతో భారీకాయుడైన క్రిస్‌ గేల్‌ ఓ వైపు! బక్కపలుచటి దేహంతో.. పొట్టిగా కనిపించే యుజ్వేంద్ర చాహల్‌ మరోవైపు! ఈ ఇద్దరు కలిసి పక్కపక్కన నిలబడి తమ శరీర సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా..! బెంగళూరుపై పంజాబ్‌ కింగ్స్‌ విజయం అనంతరం వీళ్లు ఇలా సరదాగా ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేసిన పంజాబ్‌ కింగ్స్‌.. ఆర్సీబీతో మ్యాచ్‌ను క్లుప్తంగా చెప్పాలంటే ఇలాగే ఉంటుందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని