రాహుల్‌కు అపెండిసైటిస్‌

పంజాబ్‌ కింగ్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగలింది. అపెండిసైటిస్‌తో ఆస్పత్రిపాలైన ఆ జట్టు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌.. కనీసం రెండు వారాల పాటు ఐపీఎల్‌కు దూరమయ్యాడు. మొత్తం టోర్నీకే దూరమయ్యే అవకాశం ఉంది. రాహుల్‌ అనారోగ్యం గురించి

Published : 03 May 2021 02:04 IST

అహ్మదాబాద్‌: పంజాబ్‌ కింగ్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగలింది. అపెండిసైటిస్‌తో ఆస్పత్రిపాలైన ఆ జట్టు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌.. కనీసం రెండు వారాల పాటు ఐపీఎల్‌కు దూరమయ్యాడు. మొత్తం టోర్నీకే దూరమయ్యే అవకాశం ఉంది. రాహుల్‌ అనారోగ్యం గురించి పంజాబ్‌ ఫ్రాంఛైజీ ట్విట్టర్లో ప్రకటించింది. ‘‘గత రాత్రి రాహుల్‌కు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. అది అపెండిసైటిస్‌ అని పరీక్షల్లో తేలింది. రాహుల్‌ను ఆస్పత్రికి తరలించాం. అక్కడ అతడికి శస్త్రచికిత్స జరగనుంది’’ అని పంజాబ్‌ ఆదివారం ట్వీట్‌ చేసింది. రాహుల్‌ ప్రస్తుతం ఏడు మ్యాచ్‌ల్లో 331 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌లో రెండో స్థానంలో ఉన్నాడు.  రాహుల్‌ గైర్హాజరీలో మయాంక్‌ అగర్వాల్‌ పంజాబ్‌కు నాయకత్వం వహిస్తాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని