జడేజాకు చపాతి పరిమాణంలో చాలు..
టీమ్‌ఇండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా సత్తా చాటేందుకు పిచ్‌పై చపాతి పరిణామంలో చిన్నగా పాద ముద్రలు (ఫుట్‌మార్క్స్) ఉంటే చాలని ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు.
సిడ్నీ: టీమ్‌ఇండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా సత్తా చాటేందుకు పిచ్‌పై చపాతి పరిణామంలో చిన్నగా పాద ముద్రలు (ఫుట్‌మార్క్స్) ఉంటే చాలని ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో జడేజా, అశ్విన్ కచ్చితంగా న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడతారని తెలిపాడు. ‘‘ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌కు జడేజా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. చపాతి పరిణామంలో పాద ముద్రలున్నా అతడికి చాలు. అదే ప్రాంతంలో నిలకడగా బంతుల్ని సంధిస్తాడు. ఫైనల్లో జడేజా, అశ్విన్ కివీస్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టడం ఖాయం. ఇక ఆస్ట్రేలియాలో టీమ్‌ఇండియా యువ జట్టు సత్తా చాటింది. టన్నులకొద్దీ పరుగులు సాధించిన ప్రపంచ స్థాయి కెప్టెన్ లేకపోయినా యువ ఆటగాళ్లు రెట్టించిన ఉత్సాహంతో మమ్మల్ని ఓడించడం గొప్ప విషయం. ఐపీఎల్, రాహుల్ ద్రవిడ్‌లదే ఈ ఘనత. సరైన వ్యవస్థ ద్వారా యువ ఆటగాళ్లను అంతర్జాతీయ క్రికెటర్లుగా సిద్ధం చేస్తున్న ద్రవిడ్ అద్భుతంగా పని చేస్తున్నాడు. వాళ్లు ఆసీస్‌లో ఆడినప్పుడు ఆ విషయం స్పష్టమైంది. ఇప్పుడున్నట్లుగానే భవిష్యత్తులోనూ టెస్టు క్రికెట్లో టీమ్‌ఇండియా దుర్బేధ్యంగా ఉంటుంది’’ అని వార్నర్ పేర్కొన్నాడు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Andhra News: సీఎం జగన్‌పై పోస్టులు పెట్టారని ప్రవాసాంధ్రుడి అరెస్టు
-
Crime News
Vijayawada: వేడినీళ్ల బకెట్లో పడి 8 నెలల శిశువు మృతి
-
India News
Nirmala Sitharaman: చిన్నారి మోములో చిరునవ్వు కోసం..
-
Ap-top-news News
Vande Bharat Express: 8.30 గంటల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి.. వందేభారత్ టైమింగ్స్ ఇలా...
-
India News
Ramayanam: 530 పేజీల బంగారు రామాయణం!
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే..