ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో మన్కడ్
దుబాయ్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ నేపథ్యంలో అయిదు దేశాలకు చెందిన పది మంది దిగ్గజాలకు ఐసీసీ.. హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు కల్పించింది. తరానికి ఇద్దరికి చొప్పున అయిదు తరాల క్రికెటర్లను ఐసీసీ ఎంపిక చేసింది. ఇందులో భారత దిగ్గజం వినూ మన్కడ్ కూడా ఉన్నాడు. ‘‘క్రికెట్ చరిత్రలో ఈ పది మంది పాత్ర ఎంతో ముఖ్యమైంది. వీరి చేరికతో హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఆటగాళ్ల సంఖ్య 103కు చేరింది’’ అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. తాజాగా హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కిన వారిలో మన్కడ్‌తో పాటు ఫాల్క్‌నర్ (దక్షిణాఫ్రికా), మాంటీ నోబుల్ (ఆస్ట్రేలియా), కాన్స్టంటైన్ (వెస్టిండీస్), స్టాన్ మెక్‌కేబ్ (ఆస్ట్రేలియా), టెడ్ డెక్స్టర్ (ఇంగ్లాండ్), డెస్మండ్ హేన్స్ (వెస్టిండీస్), బాబ్ విలిస్ (ఇంగ్లాండ్), ఆండీ ఫ్లవర్ (జింబాబ్వే), కుమార సంగక్కర (శ్రీలంక) ఉన్నారు. భారత క్రికెట్లో గొప్ప ఆల్‌రౌండర్‌గా పేరున్న మన్కడ్.. 44 టెస్టుల్లో 2109 పరుగులు చేశాడు. అతడు ఓపెనర్. మన్కడ్ తన ఎడమచేతి వాటం స్పిన్‌తో 162 వికెట్లు పడగొట్టాడు. మన్కడ్ పేరిట బీసీసీఐ దేశవాళీ క్రికెట్ టోర్నీ నిర్వహిస్తుందన్న సంగతి తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Eatala Rajender: నేను సీఎం అభ్యర్థిని కాదు : ఈటల రాజేందర్
-
India News
Nupur Sharma: నుపుర్ శర్మకు సుప్రీంకోర్టులో ఊరట.. కేసులన్నీ దిల్లీకి బదిలీ
-
General News
Heart Attack: గుండెపోటు ఎలా వస్తుందో తెలుసా..?
-
Sports News
Rohit sharma: ఈ ఫ్లాన్తోనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్‌ను అందిస్తాం: రోహిత్ శర్మ
-
Crime News
Telangana News: మహిళా రోగితో అసభ్య ప్రవర్తన.. వైద్యుడికి పదేళ్ల జైలుశిక్ష
-
Movies News
Aamir Khan: ‘గత 48గంటల నుంచి నేను నిద్రపోలేదు’ : ఆమిర్‌ఖాన్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Naga Chaitanya: అది నా పెళ్లి తేదీ.. దయచేసి ఎవరూ ఫాలో కాకండి: నాగచైతన్య
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Langya virus: చైనాలో జంతువుల నుంచి మరో కొత్తవైరస్ వ్యాప్తి
- Poorna: పెళ్లి క్యాన్సిల్ వార్తలపై పూర్ణ ఏమన్నారంటే..!
- Raghurama: వాళ్లిద్దరూ ఇష్టపడితే మనకేం ఇబ్బంది?: రఘురామ
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
- Vijay Deverakonda: ప్రమోషన్స్‌కి చెప్పులేసుకెళ్లడానికి కారణమదే: విజయ్ దేవరకొండ
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/08/2022)