అవును.. యూఏఈలోనే

భారత్‌ ఆతిథ్యమివ్వాల్సిన టీ20 ప్రపంచకప్‌ను కరోనా మహమ్మారి కారణంగా యూఏఈకి తరలించారు. వేదికలో మార్పు చాలా రోజులుగా అనుకుంటున్నదే. కానీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ సోమవారం ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాడు.

Updated : 29 Jun 2021 12:22 IST

దిల్లీ: భారత్‌ ఆతిథ్యమివ్వాల్సిన టీ20 ప్రపంచకప్‌ను కరోనా మహమ్మారి కారణంగా యూఏఈకి తరలించారు. వేదికలో మార్పు చాలా రోజులుగా అనుకుంటున్నదే. కానీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ సోమవారం ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాడు. ‘‘టీ20 ప్రపంచకప్‌ను యూఏఈకి తరలించవచ్చని ఐసీసీకి చెప్పాం. టోర్నీతో ప్రమేయం ఉన్న అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని గంగూలీ చెప్పాడు. టోర్నీ జరిగేది యూఏఈలోనే అయినా ఆతిథ్యమిచ్చేది బీసీసీఐనే. అక్టోబరు 17న టోర్నీ ఆరంభాన్ని ఖరారు చేశారా అని అడిగినప్పుడు.. ‘‘కొన్ని రోజుల్లో షెడ్యూలును ఖరారు చేయగలుగుతాం. అక్టోబరు 17న టోర్నీని మొదలెట్టాలని ఇంకా నిర్ణయించలేదు’’ అని గంగూలీ చెప్పాడు. ఐసీసీ ప్రతినిధి కూడా టోర్నీ ప్రారంభ తేదీని ఇంకా నిర్ణయించలేదన్నాడు. మరోవైపు ఏ పరిస్థితుల్లో ప్రపంచకప్‌ను తరలించాల్సి వచ్చిందో వివరిస్తూ అన్ని రాష్ట్ర సంఘాలకు బీసీసీఐ కార్యదర్శి జై షా లేఖ రాశాడు.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని