Tokyo olympics: 12 ఏళ్లకే ఒలింపిక్స్‌కు

టోక్యోలో ఈసారి అందరి దృష్టి హెంద్‌ జజాపైనే. ఎందుకంటే  ఈ ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న అత్యంత పిన్న వయసు అథ్లెట్‌ ఆమే. సిరియా టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి హెంద్‌ 12 ఏళ్లకే ఒలింపిక్స్‌లో పాల్గొనబోతోంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 155వ స్థానంలో ఉన్న జజా..

Updated : 13 Jul 2021 07:35 IST

టోక్యో ఒలింపిక్స్‌ ఇంకో 10 రోజుల్లో

డమాస్కస్‌: టోక్యోలో ఈసారి అందరి దృష్టి హెంద్‌ జజాపైనే. ఎందుకంటే  ఈ ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న అత్యంత పిన్న వయసు అథ్లెట్‌ ఆమే. సిరియా టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి హెంద్‌ 12 ఏళ్లకే ఒలింపిక్స్‌లో పాల్గొనబోతోంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 155వ స్థానంలో ఉన్న జజా.. జోర్డాన్‌లో గత ఫిబ్రవరిలో జరిగిన పశ్చిమ ఆసియా టీటీ అర్హత టోర్నీలో టైటిల్‌ ద్వారా టోక్యో బెర్తు సంపాదించింది. బెర్తు దక్కించుకునే సమయానికి ఆమె వయసు 11 ఏళ్లే కావడం విశేషం. ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్న అయిదో పిన్న వయస్కురాలు ఆమే. 1968 మెక్సికో ఒలింపిక్స్‌లో బిట్రీస్‌ (రొమేనియా, ఫిగర్‌ స్కేటింగ్‌, 13 ఏళ్లు) తర్వాత ఇంత చిన్న వయసులో ఈ మెగా ఈవెంట్లో పోటీపడుతున్న ఘనత హెంద్‌దే. 1896 ఏథెన్స్‌ ఆధునిక ఒలింపిక్స్‌లో 10 ఏళ్ల పిన్న వయస్సులో జిమ్నాస్ట్‌ దిమిత్రోస్‌ లౌండ్రాస్‌ పోటీపడి కాంస్యం గెలిచాడు. ఒలింపిక్స్‌లో పిన్న వయసు అథ్లెట్‌ రికార్డు అతడిదే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని