Tokyo Olympics: భార్యాభర్తలు రజతాలు పట్టారు

ఒలింపిక్స్‌లో ఒక పతకం వస్తేనే గొప్ప.. అలాంటిది ఒకే ఇంట్లో రెండు పతకాలు వస్తే! బ్రిటన్‌ భార్యాభర్తలు జాసన్‌ కెన్నీ, లౌరా దీన్ని నిజం చేశారు. వాళ్లిద్దరికి ఇదే కొత్త కాదు. గత కొన్ని ఒలింపిక్స్‌ల

Updated : 04 Aug 2021 07:58 IST

టోక్యో: ఒలింపిక్స్‌లో ఒక పతకం వస్తేనే గొప్ప.. అలాంటిది ఒకే ఇంట్లో రెండు పతకాలు వస్తే! బ్రిటన్‌ భార్యాభర్తలు జాసన్‌ కెన్నీ, లౌరా దీన్ని నిజం చేశారు. వాళ్లిద్దరికి ఇదే కొత్త కాదు. గత కొన్ని ఒలింపిక్స్‌ల నుంచి ఈ జోడీ పతకాల పంట పండిస్తూనే ఉంది. టోక్యో ఒలింపిక్స్‌లో సైక్లింగ్‌లో జాసన్‌ రజతం సాధించిన 20 నిమిషాల వ్యవధిలోనే లౌరా రజతం గెలవడం విశేషం. పురుషుల టీమ్‌ స్ప్రింట్‌లో బ్రిటన్‌ రెండో స్థానంలో నిలవగా, మహిళల టీమ్‌ పర్స్యూట్‌లోనూ బ్రిటన్‌ అదే స్థానాన్ని సాధించింది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో వ్యక్తిగత, టీమ్‌ విభాగాల్లో పసిడి పతకాలు గెలిచిన లౌరా.. రియోలోనూ ఆ ఫీట్‌ను పునరావృతం చేసింది. ఇప్పుడు టోక్యోలోనూ రజతంతో మెరిసింది. ఇక బీజింగ్‌లో టీమ్‌ పసిడి.. స్ప్రింట్‌ రజతం, లండన్‌లో టీమ్‌, వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణాలు సాధించిన జాసన్‌ కెన్నీ.. రియోలో టీమ్‌, స్ప్రింట్‌, కెరిన్‌ విభాగాల్లో పసిడి పతకాలతో సంచలనం సృష్టించాడు. టోక్యోలో టీమ్‌ స్ప్రింట్‌లో అతడు రజతం గెలిచాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని