Published : 08/08/2021 03:56 IST

అద్భుతం చేశావ్‌..

నీరజ్‌తో ఫొన్లో మోదీ

టోక్యో ఒలింపిక్స్‌ జావెలిన్‌ త్రోలో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన నీరజ్‌ చోప్రాను భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. శనివారం విజయం సాధించాక అతనితో ప్రధాని ఫొన్లో మాట్లాడారు. ‘‘ఒలింపిక్స్‌లో మన పోటీల చివరి రోజున స్వర్ణంతో దేశానికి సంతోషాన్ని అందించిన నీకు (నీరజ్‌) అభినందనలు. ఈ క్రీడలు వాయిదా పడడంతో పాటు కరోనా పరిస్థితుల కారణంగా ఏడాది పాటు ఎంతో తీవ్రంగా శ్రమించావు. భుజం గాయంతో పోరాడావు. ఇన్ని అడ్డంకులను దాటి ఇప్పుడు అద్భుతం చేశావు. ఆగస్టు 15న నిన్ను కలుస్తా’’ అని మోదీ అన్నారు. అందుకు సమాధానంగా.. ‘‘ఇది ఎంతో కఠినమైన ప్రయాణం. నా వంద శాతం ఇవ్వాలనుకున్నా’’ అని నీరజ్‌ చెప్పాడు. మాటల మధ్యలో మోదీ.. ‘‘పానిపట్‌ నీటి (పానీ) శక్తిని చూపించావు’’ అని సరదాగా వ్యాఖ్యానించారు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని