రాహుల్‌పై సీసా బిరడాలు

లార్డ్స్‌ మైదానంలో అభిమానుల దుష్ప్రవర్తన కారణంగా భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య రెండో టెస్టులో మూడో రోజు ఆటకు రెండుసార్లు అంతరాయం కలిగింది. లంచ్‌ విరామానికి ముందు బౌండరీ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న కేఎల్‌ రాహుల్‌ లక్ష్యంగా సీసా ...

Published : 15 Aug 2021 03:58 IST

లండన్‌: లార్డ్స్‌ మైదానంలో అభిమానుల దుష్ప్రవర్తన కారణంగా భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య రెండో టెస్టులో మూడో రోజు ఆటకు రెండుసార్లు అంతరాయం కలిగింది. లంచ్‌ విరామానికి ముందు బౌండరీ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న కేఎల్‌ రాహుల్‌ లక్ష్యంగా సీసా బిరడాలు మైదానంలో పడ్డాయి. ఇన్నింగ్స్‌ 69వ ఓవర్‌ను షమి బౌలింగ్‌ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. షాంపైన్‌ సీసా బిరడాలు తన దగ్గర పడటంపై రాహుల్‌ ఫిర్యాదు చేశాడు. వాటిని తీసి తిరిగి స్టాండ్స్‌లోకి విసురమని కోహ్లి.. రాహుల్‌కు సంజ్ఞలు చేయడం కనిపించింది. భారత ఆటగాళ్లు అంపైర్లు మైకేల్‌ గాఫ్‌, రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌లకు ఫిర్యాదు చేశారు. భారత తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్‌ 129 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు భారత ఆటగాడిలా దుస్తులు ధరించిన ఓ ఇంగ్లిష్‌ అభిమాని.. మైదానంలోకి రావడం..భద్రతా సిబ్బంది ఆపినా తన జెర్సీపై ఉన్న బీసీసీఐ లోగోను చూపించడం గందరగోళానికి కారణమైంది. చివరికి అతడిని భద్రతా సిబ్బంది బలవంతంగా మైదానం బయటకు తీసుకెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని