India vs England: ఇంగ్లాండ్‌ బాల్‌ టాంపరింగ్‌!

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య 2018లో కేప్‌టౌన్‌లో జరిగిన టెస్టు గుర్తుందా? ఆ మ్యాచ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడడం క్రికెట్‌ ప్రపంచాన్నే కుదిపేసింది.

Updated : 16 Aug 2021 08:16 IST

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య 2018లో కేప్‌టౌన్‌లో జరిగిన టెస్టు గుర్తుందా? ఆ మ్యాచ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడడం క్రికెట్‌ ప్రపంచాన్నే కుదిపేసింది. ఆ వివాదంపై రోజుల తరబడి చర్చ జరిగింది. అప్పటి కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ సహా ముగ్గురు ఆసీస్‌ క్రికెటర్లు నిషేధానికి కూడా గురయ్యారు. ఆ కుంభకోణం అందరి జ్ఞాపకాల్లో నుంచి ఇంకా తొలగిపోలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లాండ్‌ ఆటగాళ్ల చర్య వివాదాస్పాదమైంది. వాళ్లు ఈసారి ఆసీస్‌ ఆటగాళ్లలా టాంపరింగ్‌ కోసం సాండ్‌పేపర్‌ను ఉపయోగించలేదు. కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా వాళ్లు షూస్‌ స్పైక్స్‌తో బంతిని తొక్కడం కెమెరా కంటపడింది. ఎవరో తెలియదు కానీ.. లంచ్‌ తర్వాత  ఇద్దరు ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు బంతిని అటు ఇటూ తంతూ దానిపై స్పైక్స్‌తో ముద్రలు వేయడం కనిపించింది. ఈ దృశ్యాలు సామాజిక మాద్యమాల్లో వైరల్‌ అయ్యాయి. టీమ్‌ ఇండియా మాజీ స్టార్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా స్పందించాడు. ‘‘అసలేం జరుగుతోంది. ఇది బాల్‌ టాంపరింగా లేదా కరోనా నివారణ చర్యా’’ అని ఓ నవ్వుతున్న ఎమోజీని జోడిస్తూ అతడు ట్వీట్‌ చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని