కోచ్‌, సీనియర్లు ఏం చేస్తున్నారు?

భారత్‌తో రెండో టెస్టులో మహ్మద్‌ షమి, జస్‌ప్రీత్‌ బుమ్రా బ్యాటింగ్‌ చేస్తుండగా ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ అనుసరించిన ‘బౌన్సర్‌’ వ్యూహం బెడిసి కొడుతుంటే మైదానంలో ఉన్న

Updated : 23 Aug 2021 13:57 IST

లండన్‌: భారత్‌తో రెండో టెస్టులో మహ్మద్‌ షమి, జస్‌ప్రీత్‌ బుమ్రా బ్యాటింగ్‌ చేస్తుండగా ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ అనుసరించిన ‘బౌన్సర్‌’ వ్యూహం బెడిసి కొడుతుంటే మైదానంలో ఉన్న సీనియర్లు, డగౌట్‌ నుంచి ఆటను చూస్తున్న కోచ్‌ సిల్వర్‌వుడ్‌ ఏం చేస్తున్నారో అర్థం కాలేదని ఆ జట్టు మాజీ సారథి మైకేల్‌ వాన్‌ అన్నాడు. ‘‘రెండో టెస్టు అయిదో రోజు లంచ్‌ విరామానికి ముందు గంటా 20 నిమిషాల సమయం గత కొన్నేళ్లలో ఇంగ్లాండ్‌ క్రికెట్లో చూసిన అత్యంత పేలవమైన దశ. బుమ్రాకు బౌన్సర్లు సంధించాలన్న రూట్‌ వ్యూహం బెడిసికొడుతుంటే జట్టులోని సీనియర్లు రూట్‌కు అండగా నిలవలేదు. వాళ్లు సాధ్యమైనంత త్వరగా జోక్యం చేసుకుని ఉండాల్సింది. కోచ్‌ సిల్వర్‌వుడ్‌ డ్రింక్స్‌ పేరుతో మైదానంలోకి ఎవరో ఒకరిని పంపించి ‘ఏం జరుగుతోందిక్కడ? వ్యూహాలు మార్చు’ అని చెప్పించి ఉండాల్సింది. గతంలో నేను మైదానంలో దిక్కుతోచని స్థితిలో ఉండగా డంకన్‌ ఫ్లెచర్‌ ఇలాగే చేశాడు. టెస్టు మ్యాచ్‌ల్లో కొన్నిసార్లు మ్యాచ్‌ ఫలితాన్ని నిర్దేశించే సందర్భాలు ఎదురవుతాయి. ఉత్తమ జట్లు ఆ సందర్భాలను ఉపయోగించుకుని మ్యాచ్‌లు గెలుస్తాయి. రెండో టెస్టులో ఇంగ్లాండ్‌కు అలాంటి అవకాశమే లభించగా.. దాన్ని నాశనం చేసుకుంది’’ అని వాన్‌ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని