Dhoni: ధోని పైసా తీసుకోకుండా..

టీ20 ప్రపంచకప్‌కు టీమ్‌ఇండియా మార్గనిర్దేశకుడిగా వ్యవహరించనున్న మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని.. అందుకోసం బీసీసీఐ నుంచి ఎలాంటి ఫీజూ తీసుకోవట్లేదట. ఉచితంగానే ఈ బాధ్యతలు

Updated : 13 Oct 2021 09:14 IST

దిల్లీ: టీ20 ప్రపంచకప్‌కు టీమ్‌ఇండియా మార్గనిర్దేశకుడిగా వ్యవహరించనున్న మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని.. అందుకోసం బీసీసీఐ నుంచి ఎలాంటి ఫీజూ తీసుకోవట్లేదట. ఉచితంగానే ఈ బాధ్యతలు నిర్వర్తించడానికి ధోని ముందుకొచ్చినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ వెల్లడించాడు. ‘‘భారత జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నందుకు ధోని డబ్బులేమీ తీసుకోవట్లేదు’’ అని గంగూలీ చెప్పాడు. ఈ నెల 17న ఆరంభమయ్యే టోర్నీ కోసం గత నెల జట్టును  ప్రకటించినపుడే ధోనీని మార్గనిర్దేశకుడిగా ఉండబోతున్న విషయాన్ని వెల్లడించడం తెలిసిందే. 40 ఏళ్ల ధోని గత ఏడాదే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని