T20 World Cup: ధోని ఉంటే చాలు : విరాట్‌

ప్రతి చిన్న విషయాన్ని ఎంతో క్షుణ్ణంగా పరిశీలించడమే కాక అప్పటికప్పుడు సలహాలు ఇవ్వడం ద్వారా మహేంద్రసింగ్‌ ధోని ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడని భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో ...

Updated : 17 Oct 2021 06:56 IST

దుబాయ్‌: ప్రతి చిన్న విషయాన్ని ఎంతో క్షుణ్ణంగా పరిశీలించడమే కాక అప్పటికప్పుడు సలహాలు ఇవ్వడం ద్వారా మహేంద్రసింగ్‌ ధోని ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడని భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు మహి మార్గనిర్దేశకుడిగా వ్యవహరించనున్న నేపథ్యంలో అతనీ వ్యాఖ్యలు చేశాడు. ‘‘తిరిగి భారత డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి రావడానికి ధోని ఉత్సాహంగా ఉన్నాడు. అతడికి అపార అనుభవం ఉంది. మేమంతా కెరీర్లు ఆరంభించిన దశలో మహి మార్గనిర్దేశకుడి పాత్రే పోషించాడు. కెరీర్‌ ఆరంభంలోనే పెద్ద టోర్నీలు ఆడే యువ క్రికెటర్లు ధోని సలహాల వల్ల లాభం పొందనున్నారు. ధోని ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అప్పటికప్పుడు సలహాలు ఇస్తాడు. అతను మాతో ఉన్నాడన్న మాటే మాకెంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. టీ20 ప్రపంచకప్‌లో మహి మార్గదర్శకుడిగా ఉండడం మాకెంతో సంతోషంగా ఉంది’’ అని విరాట్‌ పేర్కొన్నాడు. భారత క్రికెట్‌ జట్టు చీఫ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ నియమితుడు కాబోతున్నాడన్న విషయంలో తనకు స్పష్టత లేదని కోహ్లి పేర్కొన్నాడు.  ‘‘ద్రవిడ్‌ కోచ్‌ అవుతాడన్న విషయంలో ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు. ఈ విషయంపై ఇప్పటి వరకు ఎవరితోనూ చర్చించలేదు’’ అని విరాట్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని