IND vs PAK: పాకిస్థాన్‌కు రాహుల్‌ నుంచే ప్రమాదం ఎక్కువ: హెడెన్‌

భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య టీ20 ప్రపంచకప్‌ పోరులో నాయకత్వమే కీలకం అవుతుందని ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్‌ మాథ్యూ హేడెన్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘ఈసారి ఐపీఎల్‌లో ధోని, మోర్గాన్‌లు వ్యక్తిగతంగా

Updated : 22 Oct 2021 08:40 IST

కరాచి: భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య టీ20 ప్రపంచకప్‌ పోరులో నాయకత్వమే కీలకం అవుతుందని ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్‌ మాథ్యూ హేడెన్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘ఈసారి ఐపీఎల్‌లో ధోని, మోర్గాన్‌లు వ్యక్తిగతంగా రాణించలేదు. కాని నాయకత్వ పటిమతో తమ జట్లు ఫైనల్‌ చేరుకోవడంలో కీలకపాత్ర పోషించారు. కాబట్టి యూఏఈ పరిస్థితుల్లో దాయాదుల పోరులో నాయకత్వమే కీలకం అవుతుంది. హోరాహోరీగా సాగే మ్యాచ్‌లో పొరపాట్లకు అవకాశం తక్కువ. మ్యాచ్‌ ఫలితం సారథ్యంపైనే ఆధారపడి ఉంటుంది. కేఎల్‌ రాహుల్‌ ఎదుగుదలను ప్రత్యక్షంగా చూశాను. పొట్టి ఫార్మాట్‌లో అతను ఎదుర్కొన్న ఇబ్బందులు.. ఆధిపత్యం చెలాయించిన తీరును గమనించాను. పాక్‌కు రాహుల్‌ నుంచే ప్రమాదం ఎక్కువ. రిషబ్‌ పంత్‌ తెలివైన బ్యాట్స్‌మన్‌. ఆటను తనదైన దృష్టిలో చూస్తూ ప్రత్యర్థి బౌలింగ్‌ దాడిని చిత్తుచేస్తాడు. ఆస్ట్రేలియా ఆటగాడిగా యాషెస్‌ సిరీస్‌, ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లకు ఎక్కువ ప్రాధాన్యమిస్తా. కాని భారత్‌, పాక్‌ల పోరాటానికి ఏదీ సాటిరాదు’’ అని హేడెన్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని