IND vs ENG: భారత్‌ × ఇంగ్లాండ్‌.. అయిదో టెస్టుపై స్పష్టత

కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడిన భారత్‌-ఇంగ్లాండ్‌ అయిదో టెస్టుపై స్పష్టత వచ్చింది. వచ్చే ఏడాది ఈ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగానే ఈ మ్యాచ్‌

Updated : 23 Oct 2021 07:32 IST

లండన్‌: కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడిన భారత్‌-ఇంగ్లాండ్‌ అయిదో టెస్టుపై స్పష్టత వచ్చింది. వచ్చే ఏడాది ఈ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగానే ఈ మ్యాచ్‌ ఉంటుంది. అంటే సెప్టెంబరులో ముగియాల్సిన అయిదు టెస్టుల సిరీస్‌ ఫలితం వచ్చే జులైలో తేలనుంది. ఈ సిరీస్‌లో భారత్‌ 2-0 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. భారత సహాయక బృందంలోని సభ్యులకు కరోనా సోకడంతో మాంచెస్టర్‌ (సెప్టెంబరు 10-14)లో అయిదు టెస్టు ఆరంభానికి కొన్ని గంటల ముందు మ్యాచ్‌కు టీమ్‌ఇండియా దూరమైన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో భారత్‌ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌ వచ్చే ఏడాది జులై 1న ప్రారంభం కానున్నట్లు ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు తాజాగా వెల్లడించింది. వచ్చే సంవత్సరం ఇంగ్లాండ్‌లో పరిమిత ఓవర్ల సిరీస్‌లు జరిగే సమయంలోనే ఈ టెస్టును నిర్వహించబోతున్నారు. ఈ మ్యాచ్‌ ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని