IPL 2022: ఐపీఎల్‌ జట్టుపై రణ్‌వీర్‌ దంపతుల ఆసక్తి!

బాలీవుడ్‌లో శక్తిమంతమైన జంటల్లో ఒకటైన రణ్‌వీర్‌ సింగ్‌, దీపిక పదుకొనె ఓ ఐపీఎల్‌ జట్టును కొనుగోలు చేయడంపై ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌లో రెండు కొత్త

Published : 23 Oct 2021 08:39 IST

దిల్లీ: బాలీవుడ్‌లో శక్తిమంతమైన జంటల్లో ఒకటైన రణ్‌వీర్‌ సింగ్‌, దీపిక పదుకొనె ఓ ఐపీఎల్‌ జట్టును కొనుగోలు చేయడంపై ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లను చేరుస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ లీగ్‌లో పోటీపడే జట్ల సంఖ్య పదికి పెరుగుతుంది. ఇప్పుడీ రెండు కొత్త జట్లలో ఒకటిని సొంతం చేసుకునేందుకు ఈ దంపతులు ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఓ ఫ్రాంఛైజీ కోసం వీళ్లు బిడ్‌ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌ నుంచి షారుక్‌ ఖాన్‌, జూహి చావ్లా.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు యజమానులుగా ఉన్నారు. గతంలో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు కోసం శిల్పా శెట్టి దంపతులు పెట్టుబడి పెట్టారు. పంజాబ్‌ కింగ్స్‌ సహ యజమానిగా ప్రీతిజింటా కొనసాగుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని