Virat Kohli: ప్రియమైన విరాట్‌కు..

టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి అతని భార్య అనుష్క శర్మ ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. శుక్రవారం 33వ పుట్టిన రోజు చేసుకున్న కోహ్లి కోసం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా భావోద్వేగపూరితమైన సందేశాన్ని ఆమె పోస్టు చేసింది. సముద్ర

Updated : 06 Nov 2021 05:20 IST

ముంబయి: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి అతని భార్య అనుష్క శర్మ ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. శుక్రవారం 33వ పుట్టిన రోజు చేసుకున్న కోహ్లి కోసం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా భావోద్వేగపూరితమైన సందేశాన్ని ఆమె పోస్టు చేసింది. సముద్ర తీరంలో ఈ దంపతులిద్దరూ కౌగిలించుకుని నవ్వులు చిందిస్తున ఫొటోను పోస్టు చేసిన ఆమె.. ‘‘ఈ ఫొటోకి, నీ జీవితాన్ని నువ్వు నడిపించే తీరుకు ఎలాంటి వడపోత అవసరం లేదు. నిజాయితీ, ఉక్కు ధైర్యం నీలో ఉంది. నీలాగా మరెవ్వరూ చీకటిలోనుంచి వెలుగులోకి రాలేరు. దేనీకి భయపడని నీ వ్యక్తిత్వంతో ప్రతి మార్గంలోనూ నువ్వు ఎదుగుతున్నావు. ఇలా సామాజిక మాధ్యమాల్లో మనం మాట్లాడుకోమని తెలుసు. కానీ నువ్వు ఎంత అద్భుతమైన వ్యక్తివోనని కొన్నిసార్లు గట్టిగా అరిచి ప్రపంచానికి చెప్పాలనుకుంటా’’ అని వ్యాఖ్యానించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని