
T20 World Cup: ఎవరితో ఎవరు..?
సూపర్-12 దశలో ఇంకో మ్యాచ్ ఉండగానే.. సెమీఫైనల్ ప్రత్యర్థులు ఎవరో తేలిపోయింది. అఫ్గానిస్థాన్‌ను ఓడించి గ్రూప్-2లో ఆఖరి బెర్తును న్యూజిలాండ్ సాధించగా.. తన చివరి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ను చిత్తు చేసిన పాకిస్థాన్ ఈ గ్రూప్‌లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. తొలి సెమీఫైనల్లో గ్రూప్-1లో అగ్రస్థానంలో నిలిచిన ఇంగ్లాండ్, గ్రూప్-2లో రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌ను ఢీకొననుండగా.. రెండో సెమీఫైనల్లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.