
Updated : 16 Nov 2021 12:44 IST
T20 World Cup: కేన్ మామ.. వార్నర్ కాకా
దిల్లీ: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడే కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్‌లను తమవాళ్లుగా ఇక్కడి అభిమానులు భావిస్తారు. అందుకే వాళ్లను కేన్ మామ, వార్నర్ కాకా అని పిలుస్తుంటారు. ఇప్పుడు సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహించే స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా వాళ్లను అలాగే పిలవడం విశేషం. టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు అభినందనలు తెలుపుతూ రషీద్ ట్వీట్ చేశాడు. ‘‘టీ20 ప్రపంచకప్ రూపంలో మరో ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకున్న ఆస్ట్రేలియాకు అభినందనలు. న్యూజిలాండ్ ఆటగాళ్లూ బాగా ఆడారు. కేన్ మామ, వార్నర్ కాకా.. ఇలా ఇద్దరి ఆటను చూడడం ఆనందంగా ఉంది’’ అని అతను పోస్టు చేశాడు. ఇప్పుడిది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
Tags :