
Smriti Mandhana: బిగ్‌బాష్‌లో మందాన రికార్డు స్కోరు
మకాయ్: టీమ్‌ఇండియా బ్యాటర్ స్మృతి మందాన (114 నాటౌట్; 64 బంతుల్లో 14×4, 3×6) మహిళల బిగ్‌బాష్ (డబ్ల్యూబీబీఎల్)లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ లీగ్‌లో సెంచరీ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పిన మందాన.. డబ్ల్యూబీబీఎల్ అత్యధిక వ్యక్తిగత స్కోరు (ఆష్లీ గార్డెనర్- ఆస్ట్రేలియా) ఘనతను సమం చేసింది. అయితే సిడ్నీ థండర్స్ ఓటడంతో మందాన పోరాటం వృథా అయింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ 4 పరుగుల ఆధిక్యంతో సిడ్నీ థండర్స్‌పై నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 175 పరుగులు సాధించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (81 నాటౌట్; 55 బంతుల్లో 11×4, 2×6) మెరుపు ఇన్నింగ్స్‌తో సత్తాచాటింది. అనంతరం సిడ్నీ 20 ఓవర్లలో 2 వికెట్లకు 171 పరుగులు చేయగలిగింది. బ్యాటింగ్‌లో సత్తాచాటిన హర్మన్ (1/27) బౌలింగ్‌లోనూ రాణించి మెల్‌బోర్న్‌కు విజయాన్ని అందించింది. సిడ్నీ విజయానికి 6 బంతుల్లో 13 పరుగులు కావాల్సిన సమయంలో హర్మన్ బౌలింగ్ చేసి 9 పరుగులే ఇచ్చింది. దీంతో మందాన రికార్డు స్కోరు సాధించినా సిడ్నీకి విజయం దక్కలేదు.