PV Sindhu: సింధు అదరహో
టోక్యో ఒలింపిక్స్ సెమీస్‌లో ఓటమి.. ఫ్రెంచ్ ఓపెన్, ఇండోనేషియా మాస్టర్స్, ఇండోనేషియా ఓపెన్‌లోనూ అదే ఫలితం.. సెమీస్‌లోనే ఆగిన ప్రయాణం. ఈ నేపథ్యంలో ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో మరోసారి సెమీస్..
ప్రపంచ టూర్ ఫైనల్స్
సెమీస్‌లో యమగూచిపై విజయం
నేడు సియాంగ్‌తో తుది పోరు
లక్ష్యసేన్ ఓటమి
బాలి
టోక్యో ఒలింపిక్స్ సెమీస్‌లో ఓటమి.. ఫ్రెంచ్ ఓపెన్, ఇండోనేషియా మాస్టర్స్, ఇండోనేషియా ఓపెన్‌లోనూ అదే ఫలితం.. సెమీస్‌లోనే ఆగిన ప్రయాణం. ఈ నేపథ్యంలో ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో మరోసారి సెమీస్.. బలమైన ప్రత్యర్థితో పోరు. కానీ ఈ సారి మన సింధు ఆగలేదు. అద్భుత పోరాటంతో అదరగొట్టింది. మూడో సారి ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఆదివారం ఫైనల్లో కొరియా షట్లర్ అన్ సియాంగ్‌తో ఆమె పోటీపడుతుంది.
కొంత కాలంగా వేధిస్తున్న సెమీస్ గండాన్ని ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు దాటింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ గొప్పగా రాణించి ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో తుదిపోరుకు చేరింది. శనివారం మహిళల సింగిల్స్ సెమీస్‌లో ఈ ప్రపంచ ఛాంపియన్ 21-15, 15-21, 21-19 తేడాతో అకానె యమగూచి (జపాన్)పై పోరాడి గెలిచింది. ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనప్పటికీ పట్టుదలతో ఆడిన సింధు గంటా 10 నిమిషాల్లో మ్యాచ్ ముగించింది. తొలి గేమ్ ఆరంభంలో 0-4తో వెనకబడ్డ ఈ భారత షట్లర్ బలంగా పుంజుకుంది. తనదైన శైలి ఆటతీరుతో చెలరేగింది. క్రాస్ కోర్టు షార్టులు, డ్రాప్‌లు, స్మాష్‌లతో అదరగొట్టింది. మరోవైపు ప్రత్యర్థి కూడా వెనక్కి తగ్గకపోవడంతో పోరు హోరాహోరీగా మారింది. కానీ కీలక దశలో ప్రత్యర్థిపై పైచేయి సాధించిన ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు 18-15తో ఆధిక్యంలో నిలిచింది. అదే జోరులో వరుసగా మూడు పాయింట్లు నెగ్గి గేమ్ సొంతం చేసుకుంది. రెండో గేమ్ తొలి భాగంలోనూ షట్లర్లిద్దరూ నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. దీంతో ఓ దశలో 10-10తో స్కోరు సమమైంది. కానీ ఈ గేమ్‌లో విరామం తర్వాత ప్రపంచ మూడో ర్యాంకర్ యమగూచి జోరు ముందు సింధు నిలవలేకపోయింది. ప్రత్యర్థి తెలివిగా ఆడుతూ పాయింట్లు రాబట్టి ఆ గేమ్ గెలుచుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో వీళ్లిద్దరి మధ్య పోరు మరో స్థాయికి చేరింది. విజయం కోసం ఇద్దరూ ప్రాణం పెట్టి పోరాడారు. ఓ దశలో 17-12తో సింధు సులువుగానే గెలిచేలా కనిపించింది. కానీ యమగూచి పోరాటానికి సింధు అనవసర తప్పిదాలూ జత కావడం ప్రత్యర్థికి కలిసొచ్చింది. దీంతో 19-19తో చివర్లో తీవ్ర ఉత్కంఠ రేగింది. కానీ తీవ్ర ఒత్తిడిలోనూ మెరుగ్గా ఆడిన ఆమె వరుసగా రెండు పాయింట్లు సాధించి గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది. తుదిపోరులో ప్రపంచ ఆరో ర్యాంకర్ సియాంగ్‌తో సింధు తలపడుతుంది. మరో సెమీస్‌లో సియాంగ్ 25-23, 21-17తో పోర్న్‌పావీ (థాయ్‌లాండ్)పై నెగ్గింది. వరుసగా ఇండోనేషియా మాస్టర్స్, ఇండోనేషియా ఓపెన్‌లో గెలిచిన సియాంగ్‌తో మ్యాచ్‌లో సింధుకు కఠిన పరీక్ష తప్పదు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ పోరాటం ముగిసింది. సెమీస్‌లో ఈ యువ షట్లర్ 13-21, 11-21తో ప్రపంచ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడాడు. ఒలింపిక్ ఛాంపియన్ ముందు సేన్ నిలవలేకపోయాడు. తొలి గేమ్ ఆరంభంలో కాస్త పోటీనిచ్చినప్పటికీ తర్వాత పూర్తిగా వెనకబడిపోయాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్‌కు ఎంతో సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ