IND vs NZ: అజాజ్‌కు అశ్విన్‌ ప్రత్యేక కానుక

ప్రత్యర్థి జట్టయినా అత్యుత్తమంగా రాణించే ఆటగాడిని అభినందించే దృశ్యాలు క్రికెట్లో కనిపిస్తుంటాయి. సోమవారం అలాంటి సన్నివేశమే పునరావృతమైంది. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు తీసి ఆ ఘనత..

Updated : 07 Dec 2021 14:08 IST

ముంబయి: ప్రత్యర్థి జట్టయినా అత్యుత్తమంగా రాణించే ఆటగాడిని అభినందించే దృశ్యాలు క్రికెట్లో కనిపిస్తుంటాయి. సోమవారం అలాంటి సన్నివేశమే పునరావృతమైంది. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు తీసి ఆ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా రికార్డు సృష్టించిన కివీస్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌కు అశ్విన్‌ ప్రత్యేక కానుక అందించాడు. మ్యాచ్‌ ముగిశాక భారత జట్టు ఆటగాళ్ల సంతకాలతో కూడిన తన జెర్సీని అతనికిచ్చాడు. ‘‘డ్రెస్సింగ్‌ గది నుంచి అజాజ్‌ బౌలింగ్‌ను ఎంతో ఆస్వాదించా. నా సహచరులు సంతకాలు చేసిన జెర్సీని నేనే అందుకుంటానేమో అనుకున్నా’’ అని అశ్విన్‌ తెలిపాడు. ‘‘జెర్సీ అందుకున్న ఆనందాన్ని చెప్పలేను. అసలు మాటలు రావడం లేదు’’ అని అజాజ్‌ సంతోషం వ్యక్తం చేశాడు. మరోవైపు ముంబయి క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) అధ్యక్షుడు విజయ్‌ పాటిల్‌ కూడా అజాజ్‌ను సత్కరించాడు. త్వరలో ప్రారంభం కాబోయే ఎంసీఏ మ్యూజియానికి అజాజ్‌.. బంతిని, తన టీషర్ట్‌ను అందించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని