IND vs SA: ధావన్‌కు చోటుందా?
ఒకవైపు విజయ్ హజారె ట్రోఫీలో పేలవ ప్రదర్శన.. మరోవైపు కుర్రాళ్ల నుంచి గట్టి పోటీ! దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించనున్న నేపథ్యంలో సీనియర్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ పెద్ద పరీక్షనే ఎదుర్కొంటున్నాడు.
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు జట్టును ఎంపిక చేయనున్న సెలక్షన్ కమిటీ
దిల్లీ
ఒకవైపు విజయ్ హజారె ట్రోఫీలో పేలవ ప్రదర్శన.. మరోవైపు కుర్రాళ్ల నుంచి గట్టి పోటీ! దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించనున్న నేపథ్యంలో సీనియర్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ పెద్ద పరీక్షనే ఎదుర్కొంటున్నాడు. యువ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, వెంకటేశ్ అయ్యర్‌లకు జట్టులో స్థానం దాదాపుగా ఖరారైనట్లే. రోహిత్ శర్మ ఇప్పటికే వన్డే జట్టు కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. బబుల్ జీవనం, పని ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని ఎంత మంది కొత్త ఆటగాళ్లను సెలక్టర్లు ఎంపిక చేస్తారో చూడాలి.
విజయ్ హజారె ట్రోఫీలో రుతురాజ్, వెంకటేశ్ అదరగొట్టారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు రుతురాజ్ మూడు శతకాలు, వెంకటేశ్ రెండు శతకాలు కొట్టారు. వెంకటేశ్ కొన్ని కీలక వికెట్లు పడగొట్టాడు. దీంతో ప్రస్తుతానికి ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యను వెనక్కి నెట్టడానికి సిద్ధంగా ఉన్నానని చాటుకున్నాడు. అయితే స్పెషలిస్ట్ ఓపెనర్ అయిన వెంకటేశ్‌కు అయిదు లేదా ఆరో స్థానంలో ఆడాల్సి రావొచ్చు. ఇప్పటికే రోహిత్, రాహుల్‌లు జట్టులో ఉండడమే అందుకు కారణం. విజయ్ హజారెలో కేరళపై నాలుగో స్థానంలో బరిలోకి దిగి 84 బంతుల్లో 112 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్ (మధ్యప్రదేశ్).. ఆ తర్వాత అయిదో స్థానంలో ఉత్తరాఖండ్‌పై 49 బంతుల్లోనే 71 పరుగులు సాధించాడు. ఆదివారం చండీగఢ్‌పై అతడు మెరుపు సెంచరీ (113 బంతుల్లో 151) బాదాడు. ‘‘వెంకటేశ్ అయ్యర్ దక్షిణాఫ్రికాకు వెళ్లడం ఖాయం. అతడు ప్రతి మ్యాచ్‌లోనూ 9 లేదా 10 ఓవర్లు బౌలింగ్ చేస్తున్నాడు. హార్దిక్ ఇంకా గాయం నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో వెంకటేశ్‌కు అవకాశం ఇవ్వడానికి ఇదే సరైన సమయం. ఇప్పుడు అవకాశం ఇవ్వడం ద్వారా ముందు ముందు పెద్ద ఈవెంట్లకు అతణ్ని సిద్ధం చేయాలి’’ అని సెలక్షన్ కమిటీ చర్చ గురించి తెలిసిన ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు. ‘‘మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయమని చెప్పడం ద్వారా కొత్త జట్టు మేనేజ్మెంట్ మంచి పని చేసింది. గాయపడకపోతే వెంకటేశ్ దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక కావడం ఖాయం’’ అని అన్నాడు.
ధావన్ × రుతురాజ్: ఐపీఎల్లో అదిరే ప్రదర్శనతో ఆరెంట్ టోపీ అందుకున్న రుతురాజ్ విజయ్ హజారేలోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. మహారాష్ట్ర కెప్టెన్ అయిన అతడు ఈ టోర్నీలో వరుసగా మూడు సెంచరీలు దంచేశాడు. దీంతో సెలక్టర్లపై అతణ్ని బ్యాకప్ ఓపెనర్‌గా ఎంపిక చేయాలన్న ఒత్తిడి పెరుగుతోంది. రుతురాజ్ శ్రీలంక పర్యటనలో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. కానీ వన్డేల్లో ఆడే అవకాశం రాలేదు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు జట్టులో ఉన్నా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. కానీ ఇప్పుడు విజయ్ హజారేలో మూడు భారీ శతకాలు (136, 154 నాటౌట్, 124) సాధించిన అతణ్ని దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరంగా పెట్టడం సెలక్టర్లకు కష్టమైన పనే. అదే సమయంలో ధావన్ పేలవ ఫామ్‌లో ఉన్నాడు. 0, 12, 14, 18 స్కోర్లు నమోదు చేశాడు. ఏ మ్యాచ్‌లోనూ అతడు క్రీజులో సౌకర్యంగా కనిపించలేదు. అయితే సీనియర్ ఆటగాళ్ల విషయంలో కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యహరిస్తున్న తీరు ధావన్‌కు అనుకూలించవచ్చు. రహానె, ఇషాంత్‌లకు మరో అవకాశం (దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్)కు దక్కినట్లే.. ధావన్‌కూ వన్డేల్లో మరో అవకాశం లభించవచ్చు. ‘‘చివరిసారి భారత్ వన్డే సిరీస్ ఆడినప్పుడు ధావన్ కెప్టెన్. ఓ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ కూడా ఆడాడు. తనకు అత్యంత విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు పరుగులు చేసే సత్తా ధావన్‌కు ఉంది. గైక్వాడ్ జట్టులో తప్పక ఉంటాడు. అతడున్నా.. సెలక్టర్లు ధావన్‌కు చివరి అవకాశం ఇస్తారని అనుకుంటున్నా’’ అని బీసీసీఐ అధికారి చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్‌లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం