Sachin Tendulkar: ప్రపంచ ఆరాధ్య ఆటగాళ్లలో సచిన్‌

ఆటకు వీడ్కోలు పలికి ఎనిమిదేళ్లవుతున్నా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌కు ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. ఆటగాడిగా ఎన్నో రికార్డులు ఖాతాలో వేసుకున్న అతను.. ఇప్పుడు వ్యక్తిగానూ ప్రశంసలు

Updated : 17 Dec 2021 06:53 IST

ముంబయి: ఆటకు వీడ్కోలు పలికి ఎనిమిదేళ్లవుతున్నా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌కు ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. ఆటగాడిగా ఎన్నో రికార్డులు ఖాతాలో వేసుకున్న అతను.. ఇప్పుడు వ్యక్తిగానూ ప్రశంసలు పొందుతున్నాడు. ప్రపంచంలో అత్యధిక మంది ఆరాధించే వ్యక్తుల్లో సచిన్‌ 12వ స్థానంలో నిలిచాడు. ఇక ఆటగాళ్లలో అయితే ఫుట్‌బాల్‌ స్టార్లు మెస్సి, రొనాల్డో తర్వాత సచిన్‌ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. అంతర్జాతీయ మార్కెట్‌ పరిశోధన, సమాచార విశ్లేషణ సంస్థ యూగవ్‌ ప్రపంచవ్యాప్తంగా 38 దేశాల్లో 42 వేల మంది అభిప్రాయాలు సేకరించి ఈ జాబితా విడుదల చేసింది. అందులో యుఎస్‌ మాజీ అధ్యక్షుడు ట్రంప్‌, బాలీవుడ్‌ నటులు షారుక్‌ ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్‌, టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్‌ కోహ్లి కంటే కూడా సచిన్‌ ముందుండడం విశేషం. ఓ దశాబ్ద కాలంగా యునిసెఫ్‌తో కలిసి అతను పనిచేస్తున్నాడు. 2013లో దక్షిణాసియా ప్రచారకర్తగానూ నియమితుడయ్యాడు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆరోగ్యం, విద్య, క్రీడా రంగాలకు మద్దతుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ తన మంచి మనసు చాటుకుంటున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని