Sourav Ganguly: అది గంగూలీపని కాదు:దిలీప్‌ వెంగ్‌సర్కార్‌

టీమ్‌ఇండియా వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్‌ కోహ్లీని తప్పించిన తీరు బాగా లేదని దిగ్గజ ఆటగాడు దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ అన్నాడు. సెలెక్షన్‌ కమిటీ తరఫున మాట్లాడటం....

Updated : 23 Dec 2021 07:08 IST

దిల్లీ: టీమ్‌ఇండియా వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్‌ కోహ్లీని తప్పించిన తీరు బాగా లేదని దిగ్గజ ఆటగాడు దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ అన్నాడు. సెలెక్షన్‌ కమిటీ తరఫున మాట్లాడటం బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ పని కాదని తెలిపాడు. ‘‘కెప్టెన్సీ మార్పు వ్యవహారం దురదృష్టకరం. బీసీసీఐ ఈ వ్యవహారంలో మరింత సమర్థంగా వ్యవహరిస్తే బాగుండేది. అసలు విషయం ఏంటంటే.. సెలెక్షన్‌ కమిటీ తరఫున మాట్లాడటం గంగూలీ పని కానే కాదు. అతను బీసీసీఐ అధ్యక్షుడు. ఎంపికకు సంబంధించి ఎలాంటి విషయం లేదా సారథ్యం గురించి సెలెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ నేరుగా మాట్లాడాలి. మొత్తం వ్యవహారం గురించి గంగూలీ మాట్లాడాడు. తన వాదనను విరాట్‌ స్పష్టంగా చెప్పాలనుకున్నాడు. ఇదంతా సెలెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌, కెప్టెన్‌ మధ్య ఉండేదని నమ్ముతున్నా. కెప్టెన్‌ ఎంపిక, తొలగింపు పూర్తిగా సెలెక్షన్‌ కమిటీ బాధ్యత. అది గంగూలీ అధికార పరిధి కాదు. ఇప్పటికైనా పరిస్థితి మారాలి. కోహ్లీని గౌరవించాలి. టీమ్‌ఇండియాకు, భారత క్రికెట్‌కు అతను ఎంతో చేశాడు. కాని కోహ్లీతో వ్యవహరించిన తీరు అతడిని కచ్చితంగా బాధించే ఉంటుంది’’ అని వెంగ్‌సర్కార్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని