Shubhman Gill: అవకాశం ఉంటే ఎప్పటికీ కేకేఆర్‌తోనే: శుభ్‌మన్‌గిల్‌

అవకాశముంటే ఐపీఎల్‌లో ఎప్పటికీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కే ఆడాలని ఉందని కొన్నేళ్లుగా ఆ జట్టుకు ఓపెనర్‌గా వ్యవహరిస్తున్న శుభ్‌మన్‌ గిల్‌ అన్నాడు. నైట్‌రైడర్స్‌కు ఎన్నో విజయాలందించినప్పటికీ..

Published : 24 Dec 2021 07:41 IST

కోల్‌కతా: అవకాశముంటే ఐపీఎల్‌లో ఎప్పటికీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కే ఆడాలని ఉందని కొన్నేళ్లుగా ఆ జట్టుకు ఓపెనర్‌గా వ్యవహరిస్తున్న శుభ్‌మన్‌ గిల్‌ అన్నాడు. నైట్‌రైడర్స్‌కు ఎన్నో విజయాలందించినప్పటికీ.. గిల్‌ను ఆ జట్టు అట్టిపెట్టుకోలేదు. అయితే వేలంలో గిల్‌ను కోల్‌కతానే దక్కించుకుంటుందన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో అతను స్పందిస్తూ.. ‘‘కేకేఆర్‌ ఫ్రాంఛైజీతో నా అనుబంధం చాలా ప్రత్యేకమైంది. ఒకసారి ఇలాంటి బంధం ఏర్పడితే ఎప్పటికీ ఆ జట్టుతోనే ఉండిపోవాలనిపిస్తుంది. నాకైతే వీలుంటే ఎప్పుడూ బంగారం, ఊదా రంగు కలగలిసిన దుస్తుల్లోనే ఐపీఎల్‌ ఆడాలని ఉంది’’ అన్నాడు. కేకేఆర్‌ తనను అట్టిపెట్టుకోకపోవడంపై గిల్‌ మాట్లాడుతూ.. ‘‘జట్టులో చాలామంది ప్రతిభావంతులున్నారు. అట్టిపెట్టుకోవాలనుకునే ఆటగాళ్ల జాబితా పెద్దదే. కానీ అందరినీ నిలుపుకునే అవకాశం లేదు కదా’’ అని చెప్పాడు. మళ్లీ కోల్‌కతాకు ఆడే అవకాశం వస్తే ఎంతో సంతోషిస్తానని.. జట్టు ఎప్పుడూ ఒకే రకంగా ఉండదని, మార్పులకు తగ్గట్లు సర్దుకుపోవాల్సి ఉంటుందని శుభ్‌మన్‌ అభిప్రాయపడ్డాడు. 2018 వేలంలో గిల్‌ను కోల్‌కతా రూ.1.8 కోట్లకు కొనుక్కుంది. ఆ జట్టు తరఫున అతను 58 మ్యాచ్‌ల్లో 1417 పరుగులు చేశాడు. గత మూడు సీజన్లలో కోల్‌కతా తరఫున అత్యధిక పరుగులు చేసింది శుభ్‌మనే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని