IND vs SA: ఇక్కడా రాణిస్తా.. శార్దూల్‌ ధీమా

ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాలో లాగే దక్షిణాఫ్రికాలోనూ మెరుగైన ప్రదర్శన చేస్తానని ఆశిస్తున్నానని పేస్‌ బౌలర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ అన్నాడు. భారత జట్టు మేనేజ్‌మెంట్‌ దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు ఇషాంత్‌, ఉమేశ్‌లను కాదని శార్దూల్‌ను

Updated : 28 Dec 2021 06:58 IST

సెంచూరియన్‌: ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాలో లాగే దక్షిణాఫ్రికాలోనూ మెరుగైన ప్రదర్శన చేస్తానని ఆశిస్తున్నానని పేస్‌ బౌలర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ అన్నాడు. భారత జట్టు మేనేజ్‌మెంట్‌ దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు ఇషాంత్‌, ఉమేశ్‌లను కాదని శార్దూల్‌ను తుది జట్టులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ‘‘ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ల్లో లాగే దక్షిణాఫ్రికాలోనూ రాణిస్తాననుకుంటున్నా. అలా చేస్తే ఇంకా సంతోషిస్తా. బౌలింగ్‌, బ్యాటింగ్‌కు సంబంధించి ప్రణాళిక రచించుకోవడానికి ఇష్టపడతా. మైదానంలో దిగాక ఆత్మవిశ్వాసంతో ఉండడం ముఖ్యం. నేనైతే పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడతా’’ అని శార్దూల్‌ చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని