KS Bharat: ఆంధ్ర కెప్టెన్‌గాకేఎస్‌ భరత్‌.. రంజీ జట్టు ప్రకటన

ఈ సీజన్‌ రంజీ ట్రోఫీలో పోటీపడే ఆంధ్రప్రదేశ్‌ జట్టుకు వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ కేఎస్‌ భరత్‌ సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ నెల 13న ఆరంభమయ్యే టోర్నీలో పాల్గొనే 21 మందితో కూడిన రాష్ట్ర జట్టును ఆంధ్ర

Updated : 02 Jan 2022 08:09 IST

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఈ సీజన్‌ రంజీ ట్రోఫీలో పోటీపడే ఆంధ్రప్రదేశ్‌ జట్టుకు వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ కేఎస్‌ భరత్‌ సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ నెల 13న ఆరంభమయ్యే టోర్నీలో పాల్గొనే 21 మందితో కూడిన రాష్ట్ర జట్టును ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ) ప్రకటించింది. నేటి నుంచి విజయనగరంలో జట్టుకు శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు ఏసీఏ వెల్లడించింది. ఎలైట్‌ గ్రూప్‌- ఎలో ఉన్న ఆంధ్ర తన తొలి మ్యాచ్‌లో పుదుచ్చేరితో తలపడుతుంది. టోర్నీ మొదటి రోజే ఈ మ్యాచ్‌ ప్రారంభమవుతుంది. టీమ్‌ఇండియా జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్న భరత్‌.. డిసెంబర్‌ 26న ముగిసిన విజయ్‌ హజారే ట్రోఫీలో 5 మ్యాచ్‌ల్లో 92.50 సగటుతో 370 పరుగులు చేశాడు. అందులో రెండు శతకాలున్నాయి.

జట్టు: కేఎస్‌ భరత్‌ (కెప్టెన్‌), జ్ఞానేశ్వర్‌, గిరినాథ్‌, వంశీ కృష్ణ, మహీప్‌ కుమార్‌, రికీ భుయ్‌, కరణ్‌ షిండే, అశ్విన్‌ హెబ్బర్‌, సందీప్‌, తపస్వి, శశికాంత్‌, మనీశ్‌, ఆశిష్‌, విశ్వనాథ వర్మ, నరెన్‌ రెడ్డి, విజయ్‌, స్టీఫెన్‌, బండారు అయ్యప్ప, పృథ్వీ రాజ్‌, గిరినాథ్‌ రెడ్డి, మహమ్మద్‌ రఫీ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని