IND vs SA :రాహుల్‌ కెప్టెన్సీ వైఫల్యం వల్లే..

కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీ వైఫల్యం వల్లే రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా సారథి డీన్‌ ఎల్గర్‌ పని సులభం అయిందని భారత మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. ‘‘విరాట్‌ కోహ్లి కెప్టెన్‌గా లేని ఒక టెస్టు మ్యాచ్‌లో

Updated : 08 Jan 2022 07:34 IST

జొహానెస్‌బర్గ్‌: కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీ వైఫల్యం వల్లే రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా సారథి డీన్‌ ఎల్గర్‌ పని సులభం అయిందని భారత మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. ‘‘విరాట్‌ కోహ్లి కెప్టెన్‌గా లేని ఒక టెస్టు మ్యాచ్‌లో భారత్‌ ఓడడం ఇదే తొలిసారి. టీమ్‌ఇండియాతో రెండో టెస్టులో ఛేదనలో ఎల్గర్‌ చాలా సౌకర్యంగా కనిపించాడు. దీనికి తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహులే కారణం. అతడి కెప్టెన్సీ వైఫల్యమే ఎల్గర్‌కు సానుకూల సంకేతాలు ఇచ్చింది. ఎల్గర్‌ సాధారణంగా బంతిని హుక్‌ చేయడు. కానీ అలాంటి బ్యాట్స్‌మన్‌కు డీప్‌లో ఇద్దరు ఫీల్డర్లను పెట్టడంలో అర్థమే లేదు. ఈ లోపాన్ని ఉపయోగించుకుని డీన్‌ సులభంగా సింగిల్స్‌ తీసుకుంటూ క్రీజులో పాతుకుపోయాడు’’ అని సన్నీ అన్నాడు. దక్షిణాఫ్రికాతో పోలిస్తే ఫీల్డింగ్‌లో భారత్‌ పదును లోపించిందని గావస్కర్‌ పేర్కొన్నాడు. ‘‘భారత ఫీల్డింగ్‌ మరింత పదునుగా ఉండాల్సింది. దక్షిణాఫ్రికా విజయంలో వారి ఫీల్డింగ్‌ కూడా కీలకమైంది’’ అని సన్నీ చెప్పాడు. 240 పరుగుల ఛేదనలో ఎల్గర్‌ అజేయంగా 96 పరుగులు చేసి దక్షిణాఫ్రికాను గెలిపించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని