IND vs SA: రహానె వద్దు.. విహారి ముద్దు

దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో ఆరంభమయ్యే మూడో టెస్టుకు రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఫిట్‌నెస్‌ సాధిస్తే ఫామ్‌లో లేని ఆజింక్య రహానెను పక్కన పెట్టాలని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు.

Updated : 08 Jan 2022 07:32 IST

జొహానెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో ఆరంభమయ్యే మూడో టెస్టుకు రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఫిట్‌నెస్‌ సాధిస్తే ఫామ్‌లో లేని ఆజింక్య రహానెను పక్కన పెట్టాలని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. జొహానెస్‌బర్గ్‌లో జరిగిన రెండో టెస్టులో గాయం కారణంగా కోహ్లి తప్పుకోవడంతో కేఎల్‌ రాహుల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి.. విరాట్‌ స్థానంలో హనుమ విహారికి అవకాశం ఇచ్చారు. మూడో టెస్టుకు కోహ్లి తిరిగొస్తాడని భావిస్తున్న నేపథ్యంలో గౌతి మాట్లాడుతూ.. ‘‘చాలా రోజులుగా రహానె ఎలా ఆడుతున్నాడో అంతా చూస్తున్నారు. మూడో టెస్టుకు కోహ్లి వస్తే రహానెను తుది జట్టు నుంచి తప్పించాలి. విరాట్‌ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి.. రహానె స్థానంలో విహారిని అయిదో స్థానంలో ఆడించాలి. ఈ నిర్ణయం తీసుకోవడానికి ఇదే సరైన సమయం. ఎందుకంటే రహానెకు ఇలా అవకాశాలు ఇస్తూ పోతుంటే జట్టులో కుదురుకునేందుకు విహారికి మరింత సమయం పడుతుంది’’ గంభీర్‌ అన్నాడు. రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో విహారి 20, 40 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన రహానె.. రెండో ఇన్నింగ్స్‌లో 58 పరుగులు సాధించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని