Mayank Agarwal: ఐసీసీ అవార్డు రేసులో మయాంక్‌

టీమ్‌ ఇండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ రేసులో నిలిచాడు. డిసెంబరు నెల అవార్డు కోసం ఐసీసీ కుదించిన జాబితాలో మయాంక్‌తో పాటు అజాజ్‌ పటేల్‌, మిచెల్‌

Updated : 09 Jan 2022 07:37 IST

దుబాయ్‌: టీమ్‌ ఇండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ రేసులో నిలిచాడు. డిసెంబరు నెల అవార్డు కోసం ఐసీసీ కుదించిన జాబితాలో మయాంక్‌తో పాటు అజాజ్‌ పటేల్‌, మిచెల్‌ స్టార్క్‌ ఉన్నారు. అతడు రెండు మ్యాచ్‌ల్లో 69 సగటుతో 276 పరుగులు చేశాడు. సొంతగడ్డపై ముంబయిలో న్యూజిలాండ్‌తో టెస్టులో 150, 62 పరుగులు చేసిన ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు గెలుచుకున్న అతడు.. సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 60 పరుగులు చేసిన మయాంక్‌.. రాహుల్‌తో తొలి వికెట్‌కు 117 పరుగులు జోడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని