తొలి అడుగు పడేనా?

రికార్డు స్థాయిలో అండర్‌-19 ప్రపంచకప్‌ అయిదో టైటిల్‌పై కన్నేసిన భారత కుర్రాళ్లు సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు. టోర్నీ ఫేవరెట్‌గా అడుగుపెడుతున్న యువ భారత్‌ శనివారం గ్రూప్‌- బిలో దక్షిణాఫ్రికాతో పోరుతో టైటిల్‌ వేట మొదలెడుతుంది. దుబాయ్‌లో అండర్‌-19 ఆసియా కప్‌ గెలిచి నేరుగా

Updated : 15 Jan 2022 04:45 IST

నేడు దక్షిణాఫ్రికాతో యువ భారత్‌ ఢీ

అండర్‌-19 ప్రపంచకప్‌

సాయంత్రం 6.30 నుంచి

జార్జ్‌టౌన్‌: రికార్డు స్థాయిలో అండర్‌-19 ప్రపంచకప్‌ అయిదో టైటిల్‌పై కన్నేసిన భారత కుర్రాళ్లు సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు. టోర్నీ ఫేవరెట్‌గా అడుగుపెడుతున్న యువ భారత్‌ శనివారం గ్రూప్‌- బిలో దక్షిణాఫ్రికాతో పోరుతో టైటిల్‌ వేట మొదలెడుతుంది. దుబాయ్‌లో అండర్‌-19 ఆసియా కప్‌ గెలిచి నేరుగా వెస్టిండీస్‌ చేరుకున్న టీమ్‌ఇండియా అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా కనిపిస్తోంది.  బ్యాటింగ్‌లో ఓపెనర్‌ హర్నూర్‌ సింగ్‌ సూపర్‌ ఫామ్‌లో ఉండడం జట్టుకు లాభించే అంశం. ఆసియా కప్‌లో జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అతను నిలిచాడు. ఆంధ్ర కుర్రాడు షేక్‌ రషీద్‌, కెప్టెన్‌ యశ్‌ ధుల్‌, ఆల్‌రౌండర్‌ రాజ్‌ బవా జట్టుకు కీలకం కానున్నారు.

వెస్టిండీస్‌ 169 ఆలౌట్‌
టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌ తడబడింది.  ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి 169 పరుగులకే ఆలౌటైంది. అకీమ్‌ ఆగస్టె (57), రివాల్డో క్లార్క్‌ (37) రాణించారు. వైట్నీ, నివేథన్‌ రాధాకృష్ణన్‌, కనోలి తలో మూడు వికెట్లు పడగొట్టారు. కడపటి వార్తలందేసరికి ఆసీస్‌.. 18.5 ఓవర్లలో 3 వికెట్లకు 76 పరుగులు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని