రెండో వన్డేలో ఐర్లాండ్‌ విజయం

వన్డేలో వెస్టిండీస్‌పై ఐర్లాండ్‌ పైచేయి సాధించింది. గురువారం వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ అయిదు వికెట్ల తేడా (డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం)తో విండీస్‌పై గెలుపొందింది. మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన విండీస్‌

Published : 15 Jan 2022 03:01 IST

కింగ్‌స్టన్‌: రెండో వన్డేలో వెస్టిండీస్‌పై ఐర్లాండ్‌ పైచేయి సాధించింది. గురువారం వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ అయిదు వికెట్ల తేడా (డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం)తో విండీస్‌పై గెలుపొందింది. మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ 48 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. బ్రూక్స్‌ (43), షెఫర్డ్‌ (50), స్మిత్‌ (46) రాణించారు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఆండీ మెక్‌బ్రైన్‌ (4/36), క్రెయిగ్‌ యంగ్‌ (3/42)లు విండీస్‌ను కట్టడి చేశారు. అనంతరం ఆట నిలిచే సమయానికి ఐర్లాండ్‌ 32.3 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు సాధించింది. వర్షం తగ్గకపోవడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం మరో 21 బంతులు మిగిలివుండగానే 5 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌ విజేతగా నిలిచినట్లు ప్రకటించారు. ఐర్లాండ్‌ బ్యాటర్లలో హారీ టెక్టర్‌ (53 నాటౌట్‌), ఆండీ మెక్‌బ్రైన్‌ (35) రాణించారు. ఆదివారం మూడో వన్డే జరుగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని