చివరి టెస్టూ ఆసీస్‌దే

యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం సంపూర్ణమైంది. మూడు రోజుల్లోనే ముగిసిన అయిదో టెస్టులో ఇంగ్లాండ్‌ను చిత్తుచేసి 4-0తో యాషెస్‌ సిరీస్‌ను సొంతం చేసుకుంది.

Published : 17 Jan 2022 05:04 IST

4-0తో యాషెస్‌ సిరీస్‌ కైవసం

హోబర్ట్‌: యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం సంపూర్ణమైంది. మూడు రోజుల్లోనే ముగిసిన అయిదో టెస్టులో ఇంగ్లాండ్‌ను చిత్తుచేసి 4-0తో యాషెస్‌ సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన డేనైట్‌ టెస్టులో ఆసీస్‌ 146 పరుగుల ఆధిక్యంతో ఇంగ్లాండ్‌పై గెలుపొందింది. 271 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 38.5 ఓవర్లలో 124కే కుప్పకూలింది. పేసర్లు కమిన్స్‌ (3/42), బోలాండ్‌ (3/18), గ్రీన్‌ (3/21)లు విజృంభించడంతో ఇంగ్లాండ్‌ చేతులెత్తేసింది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 37/3తో ఆట కొనసాగించిన ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 56.3 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. మార్క్‌ వుడ్‌ (6/37), స్టువర్ట్‌ బ్రాడ్‌ (3/51) సత్తాచాటారు. సిరీస్‌ తొలి మూడు టెస్టుల్లో ఆసీస్‌ విజేతగా నిలిచింది. నాలుగో టెస్టులో డ్రా అయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 303.. ఇంగ్లాండ్‌ 188 పరుగులు చేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని