Virat Kohli : విరాట్‌తర్వాత ఎవరు?

టీ20 కెప్టెన్సీకి కోహ్లి గుడ్‌బై చెప్పినప్పుడు అసాధారణ చర్యగా ఎవరూ భావించలేదు. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌ రోహిత్‌శర్మ ఉన్నాడులే అని సర్దుకున్నారు. అయితే టెస్టు సారథ్యానికి వచ్చేసరికి తర్వాతి నాయకుడు ఎవరు?

Updated : 17 Jan 2022 14:51 IST

టీ20 కెప్టెన్సీకి కోహ్లి గుడ్‌బై చెప్పినప్పుడు అసాధారణ చర్యగా ఎవరూ భావించలేదు. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌ రోహిత్‌శర్మ ఉన్నాడులే అని సర్దుకున్నారు. అయితే టెస్టు సారథ్యానికి వచ్చేసరికి తర్వాతి నాయకుడు ఎవరు? అన్న ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది. దీనిపై చర్చ విస్తృతంగా సాగుతోంది. మరి కెప్టెన్సీ ఎవరికి దక్కుతుంది?

ఇప్పటికే వన్డే, టీ20 జట్లకు సారథిగా ఎంపికైన రోహిత్‌కే టెస్టు పగ్గాలు అప్పగించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 2023లో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌, వన్డే ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో రోహిత్‌కే పూర్తిస్థాయి సారథ్య బాధ్యతలు అప్పగిస్తే ఆశ్చర్యపోనసవరం లేదు. అతడికి  అతిపెద్ద ప్రతికూలాంశం ఫిట్‌నెసే. ఒకవేళ దీర్ఘకాలిక ప్రణాళికలు ఉంటే రాహుల్‌, పంత్‌లలో ఒకరికి టెస్టు పగ్గాలు దక్కొచ్చు. వన్డే, టీ20 జట్ల సారథ్యం మార్పు సమయంలో రాహుల్‌కు వైస్‌ కెప్టెన్‌గా ప్రమోషన్‌ లభించింది. కోహ్లి గైర్హాజరీలో దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు అతడు సారథ్యం వహించాడు. గత రెండు ఐపీఎల్‌ సీజన్‌లలో పంజాబ్‌ కింగ్స్‌కు సారథ్యం వహిస్తూ అత్యుత్తమ బ్యాటర్‌గానూ రాహుల్‌ రాణించాడు. ఇక 24 ఏళ్ల రిషబ్‌ పంత్‌ కూడా రేసులో ముందున్నాడు. వికెట్ల వెనుక చురుగ్గా ఉండే పంత్‌ది దూకుడు బ్యాటింగ్‌ శైలి. ఎవరెన్ని విమర్శలు గుప్పించినా పట్టించుకునే మనస్తత్వం కాదు. దిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన పంత్‌.. ఆకట్టుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని