Shreyas Iyer : బెంగళూరు కెప్టెన్సీ రేసులో శ్రేయస్‌

టీమ్‌ఇండియా బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను తమ జట్టుకు కెప్టెన్‌గా నియమించాలని రాయల్‌ ఛాలెంజర్‌ బెంగళూరు భావిస్తోంది. విరాట్‌ కోహ్లి స్థానంలో శ్రేయస్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని అనుకుంటోంది. రానున్న మెగా వేలంలో శ్రేయస్‌ను ఎలాగైనా దక్కించుకోవాలని ఫ్రాంచైజీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Updated : 18 Jan 2022 12:54 IST

ముంబయి: టీమ్‌ఇండియా బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను తమ జట్టుకు కెప్టెన్‌గా నియమించాలని రాయల్‌ ఛాలెంజర్‌ బెంగళూరు భావిస్తోంది. విరాట్‌ కోహ్లి స్థానంలో శ్రేయస్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని అనుకుంటోంది. రానున్న మెగా వేలంలో శ్రేయస్‌ను ఎలాగైనా దక్కించుకోవాలని ఫ్రాంచైజీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ‘‘సారథ్యానికి విరాట్‌ వీడ్కోలు పలకడంతో తదుపరి కెప్టెన్‌గా శ్రేయస్‌ ఉండాలని బెంగళూరు కోరుకుంటోంది. వచ్చేనెలలో బెంగళూరులో జరిగే వేలంలో శ్రేయస్‌ కోసం గట్టిగా ప్రయత్నించాలని భావిస్తోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ కూడా శ్రేయస్‌పై కన్నేశాయి’’ అని ఐపీఎల్‌ వర్గాలు తెలిపాయి. రిషబ్‌ పంత్‌ను సారథిగా నియమించడంతో దిల్లీ క్యాపిటల్స్‌ను శ్రేయస్‌ వీడాడు. కొత్త ఫ్రాంచైజీలు లఖ్‌నవూ, అహ్మదాబాద్‌లు కెప్టెన్సీ ఇచ్చేందుకు నిరాకరించడంతో వేలంపాటలోకి వెళ్లాలని శ్రేయస్‌ నిర్ణయించుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని